Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు …పది ఛాన్స్ లు ఇస్తే ఏమి చేసింది …కేటీఆర్ ధ్వజం…

కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు …పది ఛాన్స్ లు ఇస్తే ఏమి చేసింది …కేటీఆర్ ధ్వజం…
-రేవంత్ రెడ్డి ఒక్కసారి ఛాన్స్ పై కేటీఆర్ ఎద్దేవా !
-మీరు ఇటుకలతో కొడితే మా వాళ్లు బండరాళ్లతో కొడతారు
-జయశంకర్ భూపాలపల్లిలో కేటీఆర్ పర్యటన …
-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కాదు ..పది ఛాన్స్ ఇస్తే ఏమి చేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు …ఇటీవల రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా యాత్రలు చేస్తూ ,తమకు ఛాన్స్ ఇవ్వలని అడగటంపై ఎద్దవా చేశారు . ఒక్కసారి ఏమిటి పదిసార్లు ప్రజలు అవకాశాలు ఇచ్చారు . అయితే ఏమి చేశారు అని ప్రశ్నించారు .కాంగ్రెస్ పార్టీకి అధికారం సంగతి సరే అంతర్గత సమస్యలతో సతమవుతుందని విషయాన్నీ ప్రస్తావించారు . తమ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్దీ కాలంలోనే జరిగిన అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు . తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు .

తెలంగాణ మంత్రి కేటీఆర్ నేడు భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ తిరుగుతున్నాడని, 75 ఏళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక్కటి కాదు పది అవకాశాలు ఇచ్చారని, మళ్లీ ఆ దిక్కుమాలిన పాలన కావాలా? అని ప్రశ్నించారు.

“అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి లోబడే నాడు టీఆర్ఎస్ లో చేరారు. మీరు ఇటుకలతో కొడతామంటున్నారు. మా కార్యకర్తలు బండరాళ్లతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త… నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు” అని కేటీఆర్ హెచ్చరించారు.

ఇక, కర్ణాటక బీజేపీ నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలనే కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరుతున్నారని, లేకపోతే తమ నియోజవర్గాలను తెలంగాణలో కలిపేయాలంటున్నారని వెల్లడించారు.

Related posts

డబుల్ ఇంజిన్ సర్కారుకు తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు: ప్రధాని మోదీ

Drukpadam

ఢిల్లీలో గులాబీ కార్యాలయం … సెప్టెంబర్ 2 న భూమి పూజ చేయనున్న కేసీఆర్

Drukpadam

ఢిల్లీకి మారిన అమరావతి రైతుల యాత్ర…జంతర్ మంతర్ వద్ద ధర్నా !

Drukpadam

Leave a Comment