Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసులో అసలు దోషులను పట్టుకోండి …సజ్జల

వివేకా హత్య కేసులో అసలు దోషులను పట్టుకోండి …సజ్జల
-అవినాష్ రెడ్డికి హత్యతో ఎలాంటి సంబంధం లేదు …
-ఆదినారాయణ రెడ్డి ,బీటెక్ రవికి సంబంధాలు ఉన్నాయి
-వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉంది చంద్రబాబే …
-చంద్రబాబు కోవర్టులు సీబీఐని మేనేజ్ చేస్తున్నారని ఆరోపణ
-అసలు విషయాలు వదిలి పెట్టి వేరే కోణంలో కేసును చూస్తున్నారని వ్యాఖ్య …
-వివేకా భావమర్ది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ వెళ్లారని వెల్లడి
-ఆదినారాయణ రెడ్డికి కూడా ఫోన్ చేసింది శివప్రకాష్ రెడ్డినే

వివేకా హత్య కేసులో అసలు దోషులను వదిలి పెట్టి ఎవరెవరికో సంబంధాలు ఉన్నట్లు కథ అల్లడం పై ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మండిపడ్డారు . హత్యతో అక్కడ జరిగిన సంఘటనలతో ఎలాంటి సంబంధం లేని కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కేసులో సిబిఐ పిలవడం ఏమిటని ప్రశ్నించారు . ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదన్నారు. సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేసారు. ఈ కేసులో ఆదినారాయణరెడ్డి, బీటెక్‌రవికి సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారనన్నారు. శివశంకరరెడ్డి కూడా తప్పు చేయలేదని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వివేకానందరెడ్డి అజాత శత్రువని. వివేకా చుట్టూ నేరప్రవృత్తి కలిగిన మనుషులున్నారన్నారు. వివేకా కుటుంబంలోనూ విభేదాలున్నాయని సజ్జల చెప్పుకొచ్చారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీఎం జగన్ ను టార్గెట్‌ చేయడానికి చూస్తున్నట్లుగా ఉందని సజ్జల పేర్కొన్నారు. జగన్‌ కుటుంబానికి వివేకానందరెడ్డి తో అవినాభావ సంబంధముందని చెప్పారు. వివేకానందరెడ్డి విజయమ్మపై పోటీ చేసినా, ఆ తర్వాత ఆయన వైసీపీ లోకి వస్తానంటే సాదరంగా జగన్‌ ఆహ్వానించారని గుర్తు చేసారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అవినాష్‌రెడ్డి కి ఒక తండ్రిలా సలహాలు ఇచ్చేవారని చెప్పారు. టీడీపీ, చంద్రబాబు లైన్‌కు అనుగుణంగా సీబీఐలో కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారని సజ్జల ఆరోపించారు. నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా, కల్పిత వాంగ్మూలాలను సృష్టించి , జగన్‌ పై వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయ ప్రమేయముందని పేర్కొన్నారు.

ఈ కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌ పై కుట్రలు చేస్తున్నారని సజ్జల అనుమానం వ్యక్తం చేసారు. రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి నిందలు వేస్తే, వక్రీకరణలు చేస్తే ఆ ఎన్నికల్లో ఓట్లు పడతాయనే దురాశతో, కుట్రతో ఇంతగా చేస్తున్నారని దుయ్యబట్టారు. దీనిచుట్టూ రాజకీయాలు చేయడం, దీన్నుంచి లబ్ధిపొందాలని బాబు చూడడం రాష్ట్ర రాజకీయ దౌర్భాగ్యంగా పేర్కొన్నారు. సంఘటన జరిగిన తర్వాత శివప్రకాష్‌రెడ్డి (వివేకానందరెడ్డి బావమరిది), అక్కడ దొరికిన లేఖ అనుమానాస్పదంగా ఉందని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి, గుండెపోటుతో బావ చనిపోయారని ఆదినారాయణ రెడ్డి చెప్పారని వివరించారు. వివేకా హత్య కేసులో బాబుదే మాస్టర్ మైండ్ గా సజ్జల ఆరోపించారు.

వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, భారతమ్మ పేర్లను ప్రస్తావించడం కుట్రపూరితమని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కేసులోనూ బీజేపీలో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు ఇన్‌ఫ్లుయన్స్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం.. జగన్‌ పై నిందలు మోపుతున్నారని ఫైర్ అయ్యారు. పట్టాభి అనే వ్యక్తి గన్నవరం పోకపోతే కొట్లాటలు లేవన్నారు. దాడులు లేవు. అక్కడ ఎదురెదురు పడిన రెండు పార్టీల వ్యక్తులు దాడులకు దిగినప్పుడు పట్టాభిని రక్షించింది పోలీసులని సజ్జల చెప్పారు.జగన్‌ మౌనంగా అన్నీ సహిస్తున్నారు కాబట్టే…చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ ఇష్టమొచ్చినట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. గన్నవరంలో అల్లర్లకు కారణం చంద్రబాబేనని సజ్జల ఆరోపించారు .

Related posts

బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

Drukpadam

బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: బీవీ రాఘవులు!

Drukpadam

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనీ ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!

Drukpadam

Leave a Comment