Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ జెండా ఎగురుతుందా …?

కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ జెండా ఎగురుతుందా …?
పొత్తులపై లెఫ్ట్ తో రాని క్లారిటీ
ఉమ్మడి జిల్లాలో ఆరు సీట్లు కోరుతున్న లెఫ్ట్
వారికీ ఎమ్మెల్సీసీట్లు ఇవ్వాలని అంటున్న స్థానిక బీఆర్ యస్ నేతలు
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటున్న లెఫ్ట్ నేతలు
మమ్ములను గౌరవించే పార్టీలతోనే మా ప్రయాణమని వెల్లడి
దీంతో అయోమయంలో బీఆర్ యస్ సిట్టింగ్ లు

ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లానేడు కారణాలు ఏమైనా కమ్యూనిస్టులు పార్టీలు బలహీన పడ్డాయి. ఇది నిజాయతీగా కమ్యూనిస్టులు కూడా అంగీకరిస్తున్నారు .కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా బీఆర్ యస్ ఒంటరిగా జెండా ఎగరవేస్తుందా … ? అంటే కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. జిల్లాలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు, పొంగులేటి పార్టీని వీడిన నేపథ్యంలో బీఆర్ యస్ పరిస్థితి సంకటంగానే ఉంది.

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికి కొద్దో గొప్పో పట్టు కలిగి ఉన్న లెఫ్ట్ పార్టీలు బీఆర్ యస్ లు కలిస్తే తప్ప గులాబీ పార్టీ సీట్లు ఆశించడం అత్యాశే అవుతుంది . మిగతా జిల్లాకన్న ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు ప్రభావం బాగానే ఉంది . దీనిపై జిల్లాలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కేసీఆర్ లెఫ్ట్ లతో దోస్తీ వల్ల రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాపితంగా బీఆర్ యస్ కు మేలు జరుగుతుందని భావిస్తున్నారు . స్థానిక నేతలు మాత్రం కమ్యూనిస్టులతో పొత్తు ఉండాల్సిందేతమ సీటు వారికీ ఇవ్వద్దని అంటున్నారు . కొంతమంది అయితే వారికీ ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వండని గులాబీ బాస్ కు సలహా ఇస్తున్నారు . కమ్యూనిస్టులు మాత్రం జిల్లాలో తమకు బలమైన నియోజకవర్గాలను కోరుతున్నామని వాటిలో పోటీ తప్పదని అంటున్నారు . వారు కోరుతున్న పాలేరు , మధిర , వైరా , కొత్తగూడెం , పినపాక , భద్రాచలం నియోజవర్గాల ఉన్నాయి. అయితే ఇందులో నాలుగు నియోజకర్గంలో బీఆర్ యస్ సిట్టింగ్ లు ఉన్నారు . వాటిని కమ్యూనిస్టులకిస్తే సిట్టింగ్ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నదీంతో బీఆర్ యస్ సిట్టింగ్ లు అయోమయంలో ఉన్నారు . మధిర , భద్రాచలం లో కాంగ్రెస్ నేతలు సిట్టింగ్ లుగాఉన్నారు .

గతంలో సిపిఎం ,సిపిఐ పార్టీలు కలిసి పోటీచేసి బలమైన కాంగ్రెస్ ను మట్టి కరిపించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావంకు ముందు ,తర్వాత కూడా కమ్యూనిస్టులు జిల్లా ను శాసించారు . వారు లేకుండా జిల్లా రాజకీయాలు లేవు సభ పెట్టిన , ప్రదర్శలను చేసిన వేలు ,లక్షల్లో జనం హాజరైయ్యేవారుఅందుకే ఖమ్మం ను కమ్యూనిస్టుల ఖిల్లాగా అనేక మంది అభివర్ణించారు .

నేడు రాజకీయాలు మారాయిప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడందేశంలో బెంగాల్ , త్రిపుర లాంటి రాష్ట్రాల్లో బలంగా ఉండి అధికారం చేపట్టిన కమ్యూనిస్టులు బలహీనపడి అధికారం కోల్పోవడం జరిగింది . ఖమ్మం లో కూడా ఎర్రపార్టీల ప్రభావం తగ్గింది . జిల్లాలో సొంతంగా లెఫ్ట్ పార్టీలు గెలవలేకపోయినప్పటికీ ఓడించే శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల తో పొత్తుకు అధికారంలో ఉన్న బీఆర్ యస్ , ప్రతిపక్ష కాంగ్రెస్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

అధికార బీఆర్ యస్ తో ఇప్పటికే కమ్యూనిస్టులు తెలంగాణ లో ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం జరుగుతుంది . అయితే దాన్ని కమ్యూనిస్టులు నిర్దారించడంలేదు. ఇప్పటివరకు బీఆర్ యస్ తో ఎలాంటి పొత్తు చర్చలు జరగలేదని పొత్తులపై ఒక క్లారిటీ రాలేదని అంటున్నారు . బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కేసీఆర్ వైఖరిని స్వాగతిస్తున్నామని అందుకే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పార్టీగా ఉన్న బీఆర్ యస్ కు మద్దతు ఇచ్చామని తమ మద్దతు వల్లనే బీఆర్ యస్ గెలిచిందని అంటున్నారు లెఫ్ట్ నేతలు . దాన్ని బీఆర్ యస్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు .

బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ యస్ తోనే సాధ్యమౌతుందని కమ్యూనిస్టులు భావిస్తున్నారు . అందువల్ల బీఆర్ యస్ తో కల్సి ఎన్నికల్లో ప్రయాణం చేయాలనీ కోరుకుంటున్న కమ్యూనిస్టులకు సముచిత స్థానం లభిస్తేనే తప్పు బీఆర్ యస్ తో పొత్తు అంటున్నారు . అని దాన్ని వ్యతిరేకించడంలేదు .పొత్తు పొత్తే పోరాటం పోరాటమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు . సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తమకు పొత్తుల ఎత్తుల్లో గౌరవ ప్రదంగా ,సముచిత స్థానం కలవాలని కోరుకుంటున్నారు . ఆరకంగా బీఆర్ యస్ కూడా ఆలోచిస్తుందనే విశ్వాసం ఉందని అంటున్నారుచూద్దాం ఏమి జరుగుతుందో

Related posts

ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌.. విష‌యం ఏమిటంటే..!

Drukpadam

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్​బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!

Drukpadam

కుప్పం సభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు…

Drukpadam

Leave a Comment