Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించే అధికారం అధ్యక్షుడికి!

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియమించే అధికారం అధ్యక్షుడికి!
-ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ప్లీనరీ సమావేశాలు
-కీలకు చర్చకు దూరంగా సోనియా, రాహుల్
-మూడు రోజుల పాటు ప్లీనరీ
-దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రతినిధులు
-6 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్న స్టీరింగ్ కమిటీ

 

కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం రోజున ప్రారంభం అయ్యాయి . ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ఈ సమావేశాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్లీనరీ సమావేశాలు జరగుతున్నాయి . ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనున్నది . ఈ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా స్టీరింగ్ కమిటీ చర్చించింది . మరోవైపు ఎన్నికల గురించి జరిగే చర్చకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు దూరంగా ఉన్నారు . పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెపుతున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎంపికను భాద్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కు అప్పగిస్తూ తీర్మానం చేశారు .అధ్యక్షుడికి పూర్తీ స్వేచ్ఛను కల్పించాలని పార్టీ నిర్ణయించింది . ఈ తీర్మానాల సందర్భంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ ,ప్రియాంక దూరంగా ఉన్నారు . మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి ప్రతినిధులు హాజరైయ్యారు .

ప్రధానంగా ఈ సమావేశంలో 2024 లో పార్లమెంట్ కు జరగనున్న ఎన్నికలు పార్టీ వైఖరి ,కాంగ్రెస్ తో కలిసి వచ్చే మిత్రులపై విస్తృతంగా చర్చ జరిపి ఒక నిర్ణయానికి రానున్నారని తెలుస్తుంది.ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్ ను ప్రతిపక్షాల ఐక్యతకు ,కూటమికి నాయకత్వం వహించాలని కోరుతున్న విషయం విదితమే .అందులో భాగంగా ముఖ్యమైన తీర్మానం చేయనున్నారు. ఈలోగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన కర్ణాటక ,తెలంగాణ ,రాజస్థాన్ ,ఛత్తీస్ ఘడ్ ,మధ్యప్రదేశ్ లలో కూడా పార్టీని సన్నద్ధం చేయనున్నారు . బీజేపీ పై ప్రజల్లో ఉన్న భ్రమలు తొలుగుతున్నాయని అందువల్ల ప్రజల్లో కాంగ్రెస్ విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలనీ నిర్ణయించారు .

 

Related posts

విజయవాడ లో జరిగిన సమావేశంలో సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన ఎమ్మెల్యే లు!

Drukpadam

జగన్ గురించి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంట్ హాల్లో గోరంట్ల మాధవ్ బెదిరించారు: రఘురాజు!

Drukpadam

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్…

Drukpadam

Leave a Comment