Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసెంబ్లీ బరిలో ఎంపీ వద్దిరాజు …?

అసెంబ్లీ బరిలో ఎంపీ వద్దిరాజు …?
-కేసీఆర్ ఏది చెపితే అదే అంటున్న వద్దిరాజు
-వద్దిరాజు సేవలు రాష్ట్రానికి అవసరమనే ఆలోచనలో కేసీఆర్
-కొద్దీ నెలల్లోని కేసీఆర్ ,కేటీఆర్ మన్ననలలు పొందిన నాయకుడిగా గుర్తింపు
-ఎంపీగా వచ్చిన అవకాశానికి న్యాయం చేస్తున్న వద్దిరాజు

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అసెంబ్లీ బరిలో నిలవనున్నారా …? అంటే కేసీఆర్ ఆదిశగానే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం …బీసీగా డైనమిక్ లీడర్ గా అప్పగించిన పనిని మనసు పెట్టి చేయడంలో దిట్టగా ఆయనకు పేరుంది . హుజురాబాద్ ,మునుగోలు ఎన్నికల్లో వద్దిరాజు కీలకంగా వ్యవహరించారు . అప్పటినుంచే కేసీఆర్ ,కేటీఆర్ దృష్టిలో పడ్డారు . తన సామాజికవర్గాన్ని బీఆర్ యస్ కు దగ్గర చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . ఖమ్మం జిల్లా నేతలను ఐక్యం చేసి రానున్న ఎన్నికల్లో కేసీఆర్ అడుగు జాడల్లో జిల్లాలో మంచి ఫలితాలను సాధించాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నారు .

రాజకీయాల్లో ఆశక్తితో ఆయన మొదట కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం అసెంబ్లీకి పోటీచేయాలని గట్టి ప్రయత్నం చేశారు . కానీ టీడీపీ ,కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి అప్పుడు టీడీపీ లో ఉన్న నామ నాగేశ్వరరావు పోటీచేశారు . దీంతో వద్దిరాజుకు ఖమ్మం టికెట్ దక్కలేదు చివరకు ఎలాగైనా పోటీచేయాలని పట్టుదలతోఉన్న వద్దిరాజు వరంగల్ తూర్పు నియోజకర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు . నామినేషన్ రోజునే వెళ్లి నామినేషన్ వేసిన వద్దిరాజు కొద్దిరోజుల ప్రచారంలోనే 46 వేలకు పైగా ఓట్లు సంపాదించారు . అయితే ఆయనకు ఖమ్మం మీదనే మక్కువ ఉండటంతో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు . ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ పార్టీ బలహీనంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఒకేసారి ఇద్దరికీ రాజ్యసభ సీట్లు ఇచ్చి జిల్లాపై ఫోకస్ పెంచారు . అందులో వద్దిరాజు రవిచంద్ర , హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి ఉన్నారు . పార్థసారథిరెడ్డి పదవీకాలం అరేళ్లుకాగా , వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే …దీంతో ఆయన్ను తిరిగి రాజ్యసభకు పంపించడమా ? లేక అసెంబ్లీకి తీసుకోని రావడమా ? అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది .అయితే ఎక్కడ నుంచి పోటీచేయించాలనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నారని సమాచారం …

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది . పాలేరు లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఉండగా తుమ్మలకు సీటు గ్యారంటీ అని ఆయన అనుయాయులు సంబరపడుతున్నారు . మరికొందరు లేదు …లేదు ఈ సీటు పొత్తులో భాగంగా సిపిఎం ఇచ్చేందుకు కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు . ఇక ఖమ్మం లో మరో డైనమిక్ లీడర్ గా పేరున్న మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు . ఇక కొత్తగూడెం సీటు విషయంలోనే సందిగ్దత నెలకొన్నది . వనమా వెంకటేశ్వరరావు తిరిగి సీటు కావాలని కోరుకుంటున్న ఆయన వయసు పై బడటంతో ఇవ్వక పోవచ్చని అంటున్నారు . అయితే ఆసీటు జలగం వెంకట్రావు కు ఇస్తారా లేక వనమా సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు వైపు మొగ్గు చూపుతారా ? అనే చర్చ జరుగుతుంది. వద్దిరాజు విషయంలో మరో ఆలోచనలో కూడా సీఎం కేసీఆర్ ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు . గతంలో పోటీచేసిన వరంగల్ ఈస్ట్ నుంచి తిరిగి పోటీచేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. వైట్ అండ్ సి ఏమి జరుగుతుందో …

 

Related posts

ఆంద్రప్రదేశ్ శాసన మండలి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

Drukpadam

తనదృష్టిలో పీసీసీ పదవి చిన్నవిషయం అంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Drukpadam

ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన పార్టీలు ఇవే: ఉద్ధవ్ థాకరే ఎద్దేవా

Ram Narayana

Leave a Comment