Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే రైతుకు మిగిలింది రూ 2 లే…!

ఉల్లిపాయలు కేజీ ఒక్క రూపాయే.. 512 కేజీలు అమ్మితే రైతుకు మిగిలింది 2 రూపాయలు!
-మహారాష్ట్రలో ఘటన
-కిలో రూపాయికి చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారి
-ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్, తూకం చార్జీల కింద రూ. 509.51 మినహాయింపు
-మిగిలిన రూ. 2.49లో రౌండ్ ఫిగర్‌గా రూ. 2 లకు చెక్కు
-అది కూడా 15 రోజుల తర్వాత మార్చుకునేలా..

పాలకులు నిత్యం రైతులకోసం ఎంతో చేస్తున్నామని ఊదరగొడుతుంటారు …కానీ రైతలు మేలు చేసే చర్యలు సూన్యం …అమ్మబోతే అడవి ,కొనబోతే కొరివి అన్న చందంగా ఉంది అన్నదాతల పరిస్థితి ….అన్ని డొల్లమాటలే అని అర్థం అవుతుంది .
దేశంలోని రైతుల దుస్థితికి అద్దంపట్టే ఘటన ఇది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతు ఏం బావుకుంటున్నాడో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనమిది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు 512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే అతడికొచ్చింది ఎంతో తెలుసా? అక్షరాలా రెండు రూపాయలు. అది కూడా పోస్టు డేటెడ్ చెక్ రూపంలో. నమ్మశక్యం కాకుండా ఉంది కదూ!

రాజేంద్ర తుకారామ్ చవాన్ అనే రైతు తాను పండించిన 512 కేజీల ఉల్లిపాయలను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అక్కడి వేలంలో అతడు తీసుకెళ్లిన ఉల్లికి కేజీకి రూపాయి ధర మాత్రమే పలికింది. అంటే మొత్తం 512 కేజీల ఉల్లికి రూ. 512 మాత్రమే వచ్చింది. ఆ ఉల్లిని కొనుగోలు చేసిన ట్రేడర్ రవాణా చార్జీలు, లోడింగ్, తూకం చార్జీల కింద రూ. 509.51 మినహాయించుకున్నాడు.

అక్కడితోనే అయిపోలేదు. మిగిలిన రూ. 2.49లో 49 పైసలను తీసేసి రౌండ్ ఫిగర్ అంటూ రూ. 2 చెక్కును రైతు చేతిలో పెట్టాడు. అది కూడా 15 రోజుల తర్వాత చెల్లుబాటు అయ్యేలా. అది చూసి రైతు చవాన్‌కు కన్నీళ్లు అగలేదు. ఇది ఒక్క చవాన్‌కు మాత్రమే ఎదురైన పరిస్థితి కాదు. చాలామంది రైతులు ఎదుర్కొంటున్నదే.

Related posts

ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ : సీఎం జగన్ ప్రకటన!

Drukpadam

కర్ణాటకలో ప్రారంభమైన పోలింగ్.. బరిలో 2,165 మంది అభ్యర్థులు..!

Drukpadam

7 people To Follow If You Want A Career in UX Design

Drukpadam

Leave a Comment