Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ లిక్కర్ స్కాం ..డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్…!

ఢిల్లీ లిక్కర్ స్కాం ..డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్…!
-8 గంటల విచారణ అనంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సిబిఐ
-కుటుంబ సభ్యులకు సమాచారం
-తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు …
-ఎమ్మెల్సీ కవిత పై అభియోగాలు …సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆమె పేరు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు . ఈవిషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు . ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనను దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ఉదయం విచారణ నిమిత్తం సిబిఐ కార్యాలయానికి వెళ్లుతున్నప్పుడే తనను ఈరోజు అరెస్ట్ చేస్తారని తనకు తెలుసనీ అన్నారు . తనకు తన భార్య ఒక్కటే ఇంటిదగ్గర ఉన్నందున ఆమె బాగోగులు చేసుకోవాలని తన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని సిబిఐ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు . సిసోడియా అరెస్ట్ వార్త దేశ వ్యాప్తితంగా సంచలంగా మారింది .ఈ స్కాం లో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో తెలంగాణలో బీఆర్ యస్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది .

8 గంటలకు పైగా విచార‌ణ‌

మనీష్‌ సిసోడియా మద్యం పాలసీలో వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిచారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఆయనను సీబీఐ కేంద్ర కార్యాలయంలో విచారించింది. సుమారు 8 గంటలకు పైగా ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్టు చేశారు.

మనీశ్‌ సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ అధికారులు..

విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సీబీఐ అధికారులు సిసోడియాను ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్‌ అరోరా, ఇతర నిందితులతో గత సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్‌ కాల్స్‌ గురించి అడిగినట్లు సమాచారం. అయితే మనీశ్‌ ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ అధికారులు ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఆయన నుంచి కీలక సమాచారం సేకరించాలంటే కస్టోడియల్‌ విచారణ అవసరమన్నారు. సీబీఐ రేపు సిసోడియాను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నది. మద్యం స్కాంలో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 19న మనీశ్‌ సోసిడియా సీబీఐ విచారణ కానీ..

వాస్తవానికి ఈ నెల 19న మనీశ్‌ సోసిడియా సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆయన ఢిల్లీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనలో నిమగ్నమైనందున తనకు స‌మ‌యం ఇవ్వాల‌ని సీబీఐని కోరారు. ఆ తర్వాత ఆదివారం విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఎనిమిది గంటల పాటు విచారించిన ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

అయితే, సీబీఐ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దాఖలు చేసిన చార్జిషీట్‌ ఏడుగురి పేర్లను ప్రస్తావించారు. కానీ, ఇందులో మ‌నీశ్ సిసోడియా పేరు కనిపించలేదు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్యాపారులకు టెండ‌ర్లు కట్టబెట్టారని మ‌నీశ్ సిసోడియాపై అభియోగాలుండగా.. ఇదే కేసులో ఈడీ, సీబీఐ 12 మందిని అరెస్ట్ చేశాయి.

సీబీఐ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్షన్‌

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని విచారిస్తున్న నేప‌థ్యంలో సీబీఐ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద 144 సెక్షన్‌ విధించారు. మ‌నీశ్ సిసోడియా విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న‌కు దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు, 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సంజ‌య్ సింగ్ సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు.

Related posts

ఇంగ్లాండ్‌లో ఖమ్మం జిల్లా విద్యార్థిని దుర్మరణం…

Drukpadam

ఓ చిన్న కీటకం.. బైడెన్‌ పాత్రికేయ బృందం వెళుతున్న విమానాన్నే అడ్డుకుంది!

Drukpadam

జడ్జి హత్యపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ

Drukpadam

Leave a Comment