Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

  • నీటిపారుదలశాఖ అధికారి సంతకాలను ఫోర్జరీ చేశారంటూ కేసు
  • కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
  • విచారణ జరిపేందుకు అనుమతించిన సుప్రీంకోర్టు

ఫోర్జరీ కేసు వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వివరాల్లోకి వెళ్తే నర్సీపట్నంలో తన ఇంటిని నిర్మించే సమయంలో ఎన్వోసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ చేశారని ఆయనపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఏపీ హైకోర్టును అయ్యన్న ఆశ్రయించారు. దీంతో కేసు విచారణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. 

హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు… ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫోర్జరీ సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉత్తర్వులను జారీ చేసింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం విచారణ కొనసాగాలని ఆదేశించింది.

Related posts

విడాకులివ్వాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్..

Drukpadam

భారతీయుల నెట్ వాడకం పెరుగుతోందట.. ఎంత వాడుతున్నారంటే..!

Drukpadam

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన మెక్సికో మహిళా రాజకీయవేత్త

Ram Narayana

Leave a Comment