Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీచర్ పై హైస్కూల్ స్టూడెంట్ దాడి.. అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం!

టీచర్ పై హైస్కూల్ స్టూడెంట్ దాడి.. అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం!

  • వీడియో గేమ్ లాక్కుందనే కోపంతోనే అటాక్
  • కిందపడేసి పిడిగుద్దులు కురిపించిన విద్యార్థి
  • మేనేజ్ మెంట్ ఫిర్యాదుతో స్టూడెంట్ ను అరెస్టు చేసిన పోలీసులు

వీడియో గేమ్ ఆడుతుంటే డిస్టర్బ్ చేసిందని, తన వీడియో గేమ్ లాక్కుందని ఓ స్టూడెంట్ తన టీచర్ పైనే దాడి చేశాడు. క్లాసులో నుంచి బయటికి వెళుతున్న టీచర్ వైపు పరుగెత్తుకెళ్లి ఆమెను నెట్టిపడేశాడు. ఆపై పిడిగుద్దులు కురిపించాడు. మిగతా స్టాఫ్ ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా కాలితో తన్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ దారుణం.

ఫ్లోరిడాలోని మటాంజస్ హైస్కూల్ లో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియోలో.. బాధిత టీచర్ నడుచుకుంటూ వెళుతుండగా వెనక వైపు నుంచి పరుగెత్తుకొచ్చిన ఓ స్టూడెంట్ బలంగా నెట్టాడు. దీంతో ఆ టీచర్ ఎగిరి కింద పడింది. తలకు గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. అయినా విడవకుండా స్టూడెంట్ ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. కాలుతో తన్నుతూ, వీపుపై పంచ్ లు విసిరాడు.

చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి పట్టుకునేందుకు ప్రయత్నించినా విదిలించుకుంటూ దాడి చేశాడు. మరో ఇద్దరు టీచర్లు, సిబ్బంది వచ్చి స్టూడెంట్ ను బలవంతంగా పక్కకు లాగేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు బాధిత టీచర్ ను ఆసుపత్రికి తరలించి, దాడికి పాల్పడ్డ విద్యార్థిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Related posts

కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం

Ram Narayana

కలచివేస్తున్న ఫొటోలు : కెన్యాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు.. నీళ్లు, తిండి లేక జిరాఫీల మృత్యుఘోష!

Drukpadam

అమరరాజా బ్యాటరీస్‌లో పీసీబీ, ఐఐటీ మద్రాస్ నిపుణల తనిఖీ నివేదికను సమర్పించండి: ఏపీపీసీబీని ఆదేశించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment