Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదు?: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు…

స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదు?: ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు…

  • దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారన్న స్టాలిన్
  • కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పాటుపడుతున్నారని కితాబు
  • భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశ ప్రధాని ఎందుకు కాకూడదని ఆయన ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబిచ్చారు. స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా చెన్నైకి వచ్చారు. స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని… దాని కోసం స్టాలిన్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

Related posts

రోడ్డు మార్గంలో పోలీసులు అడ్డుకోవడంతో హెలికాప్టర్ లో వెళ్లిన రాహుల్ గాంధీ…

Drukpadam

మీరా మా గురించి మాట్లాడేది?: బొత్సపై తెలంగాణ మంత్రుల ఫైర్…

Drukpadam

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

Drukpadam

Leave a Comment