నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికల ఫలితాలు !
- ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి
- నాగాలాండ్, త్రిపురల్లో బీజేపీ కూటముల విజయం
- మేఘాలయలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కని వైనం
- అతిపెద్ద పార్టీగా ఎన్పీపీ
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి గడ్డు రోజులే అనే పరిస్థితిని తెలియజేస్తున్నాయి. పెద్దగా సంబరాలు జరుపుకునే విధంగా ఫలితాలు లేవు … త్రిపుర , మేఘాలయ , నాగాలాండ్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క త్రిపుర రాష్ట్రంలో మాత్రమే బీజేపీ స్పాష్టమైన మెజార్టీ సాధించింది
నాగాలాండ్ కూటమికి మెజార్టీ వచ్చింది .మేఘాలయాలో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. .60 సీట్లు ఉన్న త్రిపుర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమికి 33 సీట్లు వచ్చాయి. లెఫ్ట్ ,కాంగ్రెస్ కూటమికి 14 సీట్లు రాగ ,తిప్రా మోదా పార్టీకి 13 సీట్లు రావడం విశేషం …గతంలో కన్న బీజేపీకి సీట్లు తగ్గాయి. మెజార్టీ కన్న కేవలం 2 సీట్లు మాత్రమే అధికంగా ఉన్నాయి. నాగాలాండ్ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా… ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు.
మేఘాలయ విషయానికొస్తే… ఇక్కడి అసెంబ్లీలో 59 స్థానాలు ఉండగా, స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. ఎన్పీపీ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కమలం వికసించింది.
నాగాలాండ్ లో ఎన్డీపీపీ-బీజేపీ కూటమి విజయం సాధించింది. నాగాలాండ్ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా… ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు.
త్రిపురలోనూ బీజేపీ కూటమిదే పైచేయిగా నిలిచింది. త్రిపుర అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా… బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమి 33 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 31 కంటే రెండు స్థానాలు అధికంగా చేజిక్కించుకుంది. త్రిపురలో కాంగ్రెస్-వామపక్ష కూటమి 14 స్థానాలు దక్కించుకోగా, తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లో సంచలన విజయం అందుకుంది. త్రిపురలో బీజేపీ కూటమి ఆధిక్యం తగ్గడానికి కొత్త పార్టీ తిప్రా మోథానే కారణం.
ఇక, మేఘాలయ విషయానికొస్తే… ఇక్కడి అసెంబ్లీలో 59 స్థానాలు ఉండగా, స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. ఎన్పీపీ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీకి 11, తృణమూల్ కు 5, బీజేపీకి 2, హెచ్ఎస్ పీడీపీకి 2, కాంగ్రెస్ కు 5, పీడీఎఫ్ కు 2, వీపీపీకి 4 స్థానాలు లభించాయి. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు.