Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విజయమో …వీరస్వర్గమో …యుద్దభూమిలోనే అంటున్న తుమ్మల…!

విజయమోవీరస్వర్గమోయుద్దభూమిలోనే అంటున్న తుమ్మల…!
పాలేరు ..లేదా ఖమ్మం లో పోటీకి సన్నాహాలు
పార్టీ సీటు ఇస్తే సరేసరిలేదా ప్రజల మద్దతుతో రంగంలో
ఖమ్మంలో పోటీనా …? పాలేరు నా…? అనే మీమాంస ….
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్దమైన సీనియర్ నేత
తనకు ఎమ్మెల్సీ అంటూ వస్తున్నవార్తలపై అసహనం

సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన రాజకీయ ఉద్దండుడు తుమ్మల నాగేశ్వరరావుజిల్లా అభివృద్ధిపై జలగం వెంగళరావు తర్వాత అంత పేరు సంపాదించారు . ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తుమ్మల రాష్ట్ర వీడిపోయేవరకు అందులోనే ఉన్నారు . అటు ఎన్టీఆర్ , ఇటు చంద్రబాబు మంత్రివర్గాలలో కీలకమైన భారీ నీటిపారుదల, రోడ్లు భవనాలు ,తనకు ఇష్టం లేని ఆబ్కారీ శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించారు . తన హయాంలో జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు . దాదాపు 70 సంవత్సరాలు వయస్సు వస్తున్నా, ఆయన చురుకుదనం , కరుకు దనం తగ్గలేదుమాటల్లో వ్యంగ్యం ,వెటకారంతోపాటు సందర్బానుసారం నవ్వులు పూవించడంలో దిట్టజిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తుమ్మల రాజకీయాలనుంచి గౌరవప్రదమైన రిటైర్ మెంట్ కోరుకుంటున్నారు .

రాష్ట్రం వీడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ తో ఉన్న స్నేహం తుమ్మలను టీడీపీ నుంచి గులాబీ పార్టీలో చేరేలా చేసింది. ఆయన కు పార్టీ మారడం ఇష్టం లేకపోయినా తన హితులు, సన్నిహితుల కోరిక మేరకు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను కాదనలేక టీఆర్ యస్ లో చేరారు . కేసీఆర్ కూడా అదే రీతిన తుమ్మలను గౌరవించి తన మంత్రివర్గంలో చేర్చుకొని కీలకమైన రోడ్ల భవనాల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు . అందుకు తగ్గట్లుగానే ఆయన రాష్ట్రంలో రోడ్ల విస్తరణలో ,హైవేలను ,గ్రీన్ ఫీల్డ్ హైవేలను తీసుకోని రావడంలో చేసిన కృషి చెప్పొకోదగిందేపాలేరు లో భక్త రామదాసు ప్రాజక్టు అనతికాలంలో పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేత శహబాష్ అనిపించుకున్నాడు. ఉమ్మడి జిల్లాలోని భూములన్నీ గోదావరి జలాలతో తడపాలన్న తలంపుతో సీతారాం ప్రాజక్టు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు .

అభివృద్ధిని పరుగులు పెట్టించడం లో ఆయనకు ఆయనే సాటిపాలేరు ఉపఎన్నికల్లో పోటీచేసి సుమారు 50 వేల ఓట్ల మెజార్టీ తో గెలిచిన తుమ్మల రెండు సంవత్సరాలు తిరక్క ముందే జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు . ఇది సీఎం కేసీఆర్ ను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది . ఒక సీనియర్ మంత్రిగా ఉండి ఆయన ఓడిపోవడంపై కేసీఆర్ ఆగ్రహానికి గురైయ్యారు . తర్వాత జరిగిన పరిణామాల్లో కేసీఆర్ ను తుమ్మల కలిసినప్పటికీ పొడిపొడి మాటలే తప్ప ఇంతకూ ముందు ఉన్న ఆప్యాత ,ఆదరణ కనబరచలేదుపైగా జిల్లాలో తుమ్మలను దాదాపు పక్కన పెట్టారనే ప్రచారం జోరుగా సాగింది . పాలేరు నుంచి తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు . నియోజకవర్గంపై పట్టు బిగించారు .నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో ప్రజలను ఆదుకుంటూ ప్రజాభిమానం పొందుతున్నారు . సిట్టింగ్ లకే సీట్లు అని సీఎం ప్రకటించడంతో తన సీట్ కు డోకాలేదనే దృఢసంకల్పంతో ఉన్నారు .

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు ….

ఒకపక్క గెలిచిన ఉపేందర్ రెడ్డి తనకే తిరిగి టికెట్ వస్తుందని ధీమాతో ఉండగా , తనకు పాలేరు సీటు కావాలని తుమ్మల పట్టు బడుతున్నారు . సిపిఎం కూడా పాలేరు సీటు పొత్తులో భాగంగా తమకే కావాలని కోరుతుంది. ఎవరికీ ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ కు అగ్ని పరిక్షగానే ఉందికవరమంటే కప్పకు , విడవమంటే పాముకు కోపంలా ఉంది పరిస్థితిఅయితే తుమ్మల మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితిలోను పోటీచేసి తీరుతానని అంటున్నారు . తన రాజకీయ రిటైర్మెంట్ గౌరప్రదంగా ఉండాలని భావిస్తున్నారు . తనను జరిగిన అన్యాయాలపై మదనపడుతున్నారు . ఇకవేళ పార్టీ సీటు ఇవ్వకపోతే కీం కర్తవ్యం అనే ఆలోచనలో ఉన్నారు . ఇది ఎంతవరకు నిజమో తెలియదుగాని కొందరు ఆయన హితులు,సన్నిహితులు పార్టీ సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన్ను ఖమ్మం లేదా పాలేరు లో పోటీచేయించేందుకు ఒత్తిళ్లలు తెస్తున్నట్లు సమాచారంచూద్దాం తుమ్మల ఏమార్గం ఎంచుకుంటారో ….?

Related posts

ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీపై కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

తాము అధికారంలోకి వస్తే …ఆయిల్ ధరలు తగ్గిస్తాం స్టాలిన్

Drukpadam

ఐకాన్ బ్రిడ్జి డీపీఆర్‌కు గ‌డ్క‌రీ ఆదేశం.. హ‌ర్షం వ్య‌క్తం చేసిన అమ‌రావ‌తి రైతులు!

Drukpadam

Leave a Comment