Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులకు స్వల్ప అస్వస్థత…

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులకు స్వల్ప అస్వస్థత…
-జ్వరంతో భాదపడుతున్న కేసీఆర్ సతీమణి శోభ
-కేసీఆర్ పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు
-గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఇరువురికి చికిత్స
-శోభ కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు..
-కొన్ని పరీక్షల తర్వాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం
-ఆసుపత్రిలోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు
-ఆసుపత్రికి వచ్చి వెళ్లిన కూతురు ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు స్వల్ప అస్వస్థతతో ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు . దీనిపై ఏఐజీ వైద్యులు స్పందించారు. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆయనకు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. 

ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని వైద్యులు వెల్లడించారు. మిగతా వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వివరించారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు.

కేసీఆర్‌ భార్య శోభ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. శోభ వెంట కేసీఆర్ కూడా ఉన్నారు . ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే శోభతో పాటు సీఎం కేసీఆర్ కూడా స్వల్ప అస్వస్థతకు గురికావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు .

తన తల్లిని చూడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లోని తన నివాసానికి కవిత వెళ్లిపోయారు. ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. హరీశ్, కేటీఆర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కొన్ని వైద్య పరీక్షల తర్వాత శోభ డిశ్చార్జ్ అవుతారని.. సతీమణితో కలిసే కేసీఆర్ ఇంటికెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందనే దానిపై చర్చించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు వెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపట్లోనే శోభ అస్వస్థతకు గురయ్యారు.

Related posts

మంటలు ఆర్పుతుంటే గుట్టలుగా బయటపడ్డ నోట్లకట్టలు.. సికింద్రాబాద్ లో ఘటన!

Drukpadam

మోదీ ప్రారంభించిన 5 రోజులకే కోత‌కు గురైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే…

Drukpadam

తొలి పది’లో ఆరుగురు బాలురే!

Drukpadam

Leave a Comment