రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసు: ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్!

వివేకా హత్య కేసు: ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్!

  • వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ
  • ఇప్పటికే అవినాశ్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించిన సీబీఐ
  • ఈసారి విచారణలో అరెస్ట్ చేయొచ్చంటూ ప్రచారం
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సీబీఐ గత విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలపై చర్చ జరిగింది. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి కోర్టుకు వెళ్లగా, అరెస్ట్ చేయవద్దంటూ తాము ఆదేశాలివ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related posts

మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ప్రతిపాదన….

Drukpadam

‘చంద్రబాబు డైనమిక్’ అంటూ తడబడి.. సవరించుకున్న స్పీకర్ తమ్మినేని!

Drukpadam

మళ్లీ మనదే అధికారం: ముఖ్యమంత్రి జగన్!

Drukpadam