Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

కుర్చీ కోసం గొడవ.. ఆఫీసు బయట సహోద్యోగిపై యువకుడి కాల్పులుl

కుర్చీ కోసం గొడవ.. ఆఫీసు బయట సహోద్యోగిపై యువకుడి కాల్పులుl
కుర్చీ కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం
బుధవారం రెండోసారి తగవు పడ్డ యువకులు
చిలికి చిలికి గాలివానగా మారిన వివాదం
సహోద్యోగిపై కార్యాలయం వెలుపలు కాల్పులు జరిపి యువకుడు పరార్
నిందితుడి కోసం పోలీసుల గాలింపు

ఆఫీసులో కుర్చీ కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కాల్పులకు దారి తీసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్(23), అమన్ జంగ్రా సహోద్యోగులు. అయితే.. మంగళవారం ఇద్దరి మధ్య కుర్చీ విషయంలో వివాదం తలెత్తింది. బుధవారం కూడా వారిద్దరూ ఈ విషయమై మరోమారు గొడవపడ్డారు. ఈ క్రమంలో విశాల్ ఆఫీసు నుంచి బయటకు వచ్చేశాడు. ఇంతలో అమన్ విశాల్‌ వెంటే వెళ్లి అతడిపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. కాగా.. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు హత్యాయత్నం చేసినట్టు కేసు నమోదు చేశారు. అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Related posts

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 11 మంది మృత్యువాత

Drukpadam

బుద్ధా వెంకన్నఅరెస్ట్…చంద్రబాబు ఖండన ….

Drukpadam

బీహార్ లో బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం

Ram Narayana

Leave a Comment