Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్!

ముందస్తు ఎన్నికలపై స్పష్టత ఇచ్చిన సీఎం జగన్!

  • వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమీక్ష
  • సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయన్న సీఎం జగన్
  • ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
  • రూమర్లను తిప్పికొట్టాలని పిలుపు
  • గడప గడపకు కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం

ఏపీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. సంవత్సరంలో ఎన్నికలకు వెళుతున్నామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. తద్వారా, ముందుగానే అసెంబ్లీని రద్దు చేయనున్నారని జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేశారు.

మున్ముందు ఇంతకంటే తీవ్రంగా పుకార్లు వ్యాపింపజేస్తారని, టికెట్లు దక్కనివారి జాబితా ఇదేనంటూ 60 మంది పేర్లతో ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారు.

“మనం యుద్ధం చేస్తోంది మారీచుల వంటి రాక్షసులతో. దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతాన్ని పాటించే గజదొంగల ముఠా అది. మనం వచ్చాక వారి కార్యక్రమానికి విఘాతం కలగడంతో ఈ విధంగా పుకార్లు ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గుడు మరొకరు లేరు అన్నట్టుగా ఆయా ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం సాగిస్తున్నారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలి.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాదు. అందరూ ఏకం కావడం వల్ల వారికి రెండో ప్రాధాన్యత ఓటు లభించింది. అయినా కూడా అది వాపే కానీ బలుపు కాదు. అదే బలం అన్నట్టుగా కొన్ని మీడియా చానళ్లలో చూపిస్తున్నారు. 21 స్థానాలకు ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో గెలిచింది మనమే. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంపై పార్టీ నేతలు శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి” అని దిశానిర్దేశం చేశారు.

సీఎం జగన్ సమీక్ష సమావేశానికి పలువురు వైసీపీ నేతల గైర్హాజరు!

సీఎం జగన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకానాథరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గం చెబుతోంది. ఇక బుగ్గన కొవిడ్ బారినపడినట్టు సమాచారం. ఈ నెల 6న సీఎం జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనుండగా, ఆయన పర్యటన కార్యక్రమాల సమీక్షలతో విడదల రజని బిజీగా ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం సమీక్ష సమావేశంలో కనిపించలేదు. ఆయన పులివెందులలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం…

Jagananna Ku Chebudam program starts from April 13

 ఇక గడప గడపకు కార్యక్రమంపై గేర్ మార్చి స్పీడు పెంచాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇక, కొత్తగా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 13న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం అత్యంత ప్రాధాన్య అంశం అని తెలిపారు. డీబీటీ ద్వారా ఇవాళ ఒక్క బటన్ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు చేరుతోందని అన్నారు. 87 శాతం ఇళ్లకు లబ్ది చేకూరుతోందని వివరించారు.

ఇది ఎందుకు చెబుతున్నానంటే… ఈ మధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చూసినా… చంద్రబాబు అనే వ్యక్తి మాటలు విన్నా, తలలో అపోహలు ఏర్పడతాయని, వాటిని తొలగించేందుకు ఇవాళ ఇవన్నీ చెప్పాల్సి వస్తోందని సీఎం జగన్ వివరించారు.

Related posts

సింగరేణిలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మస్త్రంగా సీతక్క…

Drukpadam

ఇటు ధర్నా …అటు తనిఖీలు చల్లారని మునుగోడు హీట్…

Drukpadam

చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment