Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బండి సంజయ్ అరెస్ట్ పై బీఆర్ యస్,బీజేపీ పరస్పర ఆరోపణలు…

బండిసంజయ్అరెస్ట్పైస్పందించినఆయనభార్య

తనతల్లిచిన్నకర్మకార్యక్రమంలోపాల్గొనకుండాచేశారనిఆవేదన

అరెస్ట్చేసేప్పుడుకనీసంట్యాబ్లెట్కూడావేసుకోనివ్వలేదన్నఅపర్ణ

నిన్నఅర్ధరాత్రికరీంనగర్లోసంజయ్నుఅరెస్ట్చేసినపోలీసులు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన తీరుపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. అరెస్ట్ చేసే సమయంలో సంజయ్ కు పోలీసులు టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచి నీళ్లు తాగేందుకు కూడా అనుమతివ్వలేదన్నారు. తన భర్తతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. అరెస్ట్ సమయంలో ఆయన ముఖానికి గాయం కూడా అయిందన్నారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు చెప్పి విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదన్నారు. 

కాగా, అర్ధరాత్రి 12 గంటల తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్‌ ఇంటిని చుట్టుముట్టారు. ఆయనను అరెస్టు చేసే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్‌ కోరితే, అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబు ఇచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ విషయంలోనే బండి సంజయ్ ను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాల సమాచారం.

బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. సంజయ్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచనున్నారు. కానీ, ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్ వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది.

సంజయ్ ను ఏ కేసులో అరెస్టు చేశారో డీజీపీకే తెలియకపోవడం సిగ్గుచేటు: కిషన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సంజయ్ ను ఏ కేసులో, ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని రాష్ట్ర డీజీపీ చెప్పడం లేదన్నారు. సంజయ్ అరెస్టు విషయమై డీజీపీ అంజనీకుమార్ కు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. అయితే, కేసు వివరాలను త్వరలో చెబుతానని డీజీపీ సమాధానం ఇవ్వడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు ఫైలింగ్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తనకు తెలిపారని కిషన్ రెడ్డి  వివరించారు. ఓ ఎంపీని అరెస్ట్ చేసిన వివరాలు రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం సిగ్గు చేటని, పోలీసు వ్యవస్థ పనితీరుకు ఇది నిదర్శనమని అన్నారు. సరైన కారణం చెప్పకుండానే బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

పలువురు మీడియా ప్రతినిధులకు పంపినట్టుగా ఆ వ్యక్తి బండి సంజయ్ కు కూడా హిందీ పేపర్ ను పంపారని కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ కు ఆ వ్యక్తి హిందీ పేపర్ వాట్సాప్ లో ఎందుకు షేర్ చేశాడో తమకు తెలియదన్నారు. వాట్సాప్ లో ఓ వ్యక్తి పేపర్ ను షేర్ చేస్తే బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇక సంజయ్ అరెస్ట్ కారణంగా ఈ నెల 8వ తేదీన హైదారాబాద్ లో జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది వుండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

ఏపీ ఎన్నికల పై స్టే రద్దు…ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Drukpadam

ఖమ్మం లోకసభ సాధారణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు …ఆర్ ఓ విపి గౌతమ్

Ram Narayana

ఈ పరిస్థితుల్లో అవార్డు వద్దు … ప్రకటించినందుకు ధన్యవాదాలు :తెలకపల్లి రవి!

Drukpadam

Leave a Comment