Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బండి సంజయ్ పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..!

బండి సంజయ్ పై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే..!

  • టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్న సంజయ్ 

టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సంజయ్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు ఈరోజు విచారించనుంది. బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్నారు.

బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సెక్షన్లు:

ఐపీసీ సెక్షన్ 120(బీ) – నేరపూరిత కుట్రలో భాగస్వామి కావడం లేదా నేరాన్ని ప్రేరేపించడం
ఐపీసీ సెక్షన్ 420 – మోసం చేయడం
ఐపీసీ సెక్షన్ 447 – నేరపూరిత అపరాధానికి పాల్పడటం
ఐపీసీ 505 (1)(బీ) – ఉద్దేశ పూర్వకంగా పుకార్లు సృష్టించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం
ఐపీసీ సెక్షన్ 4(ఏ) – దేశం వెలుపల లేదా దేశం లోపల నేరాలకు పాల్పడటం
ఐపీసీ సెక్షన్ 4, 6, 8 – మాల్ ప్రాక్టీస్
66డీ ఐటీ చట్టం – సైబర్ క్రైమ్.

Related posts

మహబూబాబాద్ జిల్లాలలో దారుణం …సొంత తండ్రే కాలయముడు!

Drukpadam

పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం!

Ram Narayana

ఢిల్లీ లో కారుపై దుండగుల కాల్పులు …అన్నదమ్ములకు సీరియస్!

Drukpadam

Leave a Comment