Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ కు పోయేకాలం వచ్చింది… ఈటల రాజేందర్!

కేసీఆర్ కు పోయేకాలం వచ్చింది.. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరు: ఈటల రాజేందర్!

  • పేపర్ లీకేజీతో తనకు సంబంధం లేకపోయినా నోటీసులు ఇచ్చారన్న ఈటల
  • వేధించడానికే నోటీసులు ఇచ్చారని మండిపాటు
  • తాను టెక్నాలజీకి అప్ డేట్ కాలేదని వ్యాఖ్య

పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు పోలీసులు నోటీసులివ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తనకు నోటీసులు, జైళ్లు కొత్త కాదని ఆయన అన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు. కేవలం వేధించడానికే నోటీసులిచ్చారని మండిపడ్డారు. తాను టెక్నాలజీకి పెద్దగా అప్డేట్ కాలేదని… అందుకే మెసేజ్ లకు తాను రిప్లై ఇవ్వనని చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి తనకు పేపర్ వాట్సాప్ చేస్తే… దాన్ని చూడకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు పోయే కాలం దాపురించిందని అన్నారు. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరని వ్యాఖ్యానించారు.

సింగరేణి సంస్థ గురించి ఈటల మాట్లాడుతూ… ఈ సంస్థ రూ. 10 వేల కోట్ల అప్పులపాలు ఎందుకయిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి సింగరేణిలో 63 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 43 వేలకు పడిపోయిందని చెప్పారు. కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి రూ. 900కు పైగా ఇస్తుంటే… సింగరేణిలో రూ. 430 ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

Related posts

ఓ న్యాయమూర్తి చెప్పిన మ్యాగీ నూడిల్స్ విడాకుల కథ… ధ్వజమెత్తిన నెటిజన్లు!

Drukpadam

ఈసీ నిబంధనలపై వైసీపీ అభ్యంతరం….

Ram Narayana

విమానంలో పండంటి బిడ్డకు జన్మనించిన మహిళ.. ‘స్కై’ అని పేరు!

Drukpadam

Leave a Comment