కొత్తగూడెంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం …భారీగా హాజరైన ప్రజలు …!
ఆటపాటలతో రక్తికట్టించిన సభ …
-కొత్తగూడెం నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చిన అభిమానులు …
-సభలో ప్రత్యేక ఆకర్షణగా మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు
-కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో జరిగిన సభ …
కొత్తగూడెంలో జరిగిన పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం కు భారీగా ప్రజలు హాజరైయ్యారు . సాయంత్రం జరిగిన ఈసభలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో స్టేడియం కళకళలాడింది . ఆయన వెనక పార్టీ లేదు … ఒక్కడిగా బయలుదేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట వేలాది మంది నడుస్తుండటం , మద్దతు పలకడం విశేషం … ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు కొత్తగూడెం సభతో 9 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి . ఆ సమ్మేళనానానికి సైతం వేలాది మంది ప్రజలు హాజరైయ్యారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , అనేక మంది ఎంపీపీలు,జడ్పీటీసీలు సర్పంచ్ లు ,ఎంపీటీసీలు ,స్థానిక నాయకులూ ఈ సభకు హాజరైయ్యారు .
2014 ఎన్నికలకు ముందు వైఆర్సీపి ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన శ్రీనివాస్ రెడ్డి వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఖమ్మం ఎంపీ గా ఎన్నికైయ్యారు . తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ గూటికి చేరుకున్నారు. టీఆర్ యస్ లో చేరినప్పటికీ తనదైన శైలిలో జిల్లాలో తిరుగుతూ అన్న ,అక్క , పెద్దాయన , అంటూ ఆత్మీయ పలకరింపులతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు . నాటి నుంచి ప్రజలకు ఏ కష్టం వచ్చిన నేనున్నానంటూ అభయమిస్తున్నారు . బీఆర్ యస్ లో తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై నోచుకున్నారు.అనేక సార్లు తన ఆవేదనను పార్టీ రాష్ట్ర నేతల దగ్గర మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో పార్టీకి దూరమైయ్యారు . ఇక బీఆర్ యస్ లో ఉండటం సాధ్యం కాదనుకున్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు . ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొత్తగూడెం నియోజకవర్గం తో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వించారు . ఇక ఒక్క ఖమ్మం మాత్రమే మిగిలి ఉంది.
జూపల్లితో కలిసి వేదికపైకి పొంగులేటి …
కొత్తగూడెం నియోజకవర్గం ప్రకాశం స్టేడియం లో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనానికి మాజీఎంపీ పొంగులేటి తోపాటు మాజీమంత్రి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షత వహించారు .