Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ కు ఇక అధికారం కలే …కొత్తగూడెం సభలో పొంగులేటి , జూపల్లి …!

మూడవసారి కేసీఆర్ కు అధికారం కలగానే మిగులుతుంది..పొంగులేటి,,జూపల్లి ….!
ఉద్యమకారులను, బలిదానం చేసిన కుటుంబాలను పట్టించుకోని కేసీఆర్
మీ బాధితులంతా ఐక్యమవుతున్నారుమూల్యం చెల్లించక తప్పదుసీఎం కేసీఆర్ కు పొంగులేటి హెచ్చరిక
అధికారం ఎవడబ్బ సొత్తుకాదని అధికారులు గుర్తు పెట్టుకోవాలి
సింగరేణి కార్మికులు బోర్డర్ లో సైనికులతో సమానం అన్నసీఎం వారి చనిపోతే ఎందుకు పరామర్శించలేదు
స్కాం లీకుల ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు ..
చందాల దందాలకు కాలం చెల్లింది

తెలంగాణాలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేస్తూ ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఆధర్మకర్తగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు . ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో జరిగిన కొత్తగూడెం కు చెందిన పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో వారు పాల్గొని ప్రసంగించారు .

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఇబ్బంది పెట్టినవారంతా ఐక్యం అవుతున్నారని అందుకు బీజం పడిందని, పెట్టిన ఇబ్బందులకు మూల్యం చెల్లించలేక తప్పదని హెచ్చరించారు . అధికారం ఎవడబ్బ సొత్తుకాదుఅధికారం ఉంది కదా అని అధికారులద్వారా ప్రజలను ఇబ్బందులు పెడితే ఫలితం అనుభవించకతప్పదని గుర్తుంచుకోవాలన్నారు . మూడవసారి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కలలు కలలుగానే మిగులుతాయని అన్నారు .

అనేక మంది త్యాగాలఫలితంగా వచ్చిన తెలంగాణ ను తమ వల్లనే వచ్చిందని చెప్పుకుంటూ అంతా నేనే నాదే అనే స్వార్థం తో విర్రవీగుతున్న ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు . నిధులు , నీళ్లు , నియామకాలు అన్న సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏమి చేశారని ప్రశ్నించారు . రైతులకు రుణమాఫీ లేదు .దళితులకు మూడు ఎకరాలు భూమి ఇవ్వలేదు , …నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవునీటిపేరుతో దోపిడీకి తెరలేపారని కేసీఆర్ పాలనను దుయ్యబట్టారు . నాడు ఉద్యోగులు , కళాకారులూ , విద్యార్థులు , కార్మికులు కర్షకులు లేకపోతె తెలంగాణ రాష్ట్రం సాకారం ఆయ్యేదేనా అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను రాష్ట్రం కోసం బలిదానం చేసిన కుటుంబాలను ఒక్కొక్కరికి 10 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంఇచ్చి ఆదుకుంటామని చెప్పిన కేసీఆర్ చెప్పినమాటకు కట్టుబడి ఉన్నారా..? అని ప్రశ్నించారు .. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని విమర్శలు గుప్పించారు.

దళితులకు దళిత బందు అన్న కేసీఆర్ 17 లక్షల కుటుంబాలకు ఇస్తామని చెప్పి కేవలం 4 వేల కోట్లు ఇచ్చారని అందులో ఒక్క హుజూర్ నగర్ లోనే 2 వేల కోట్లు ఎన్నికల సందర్భంగా ఇవ్వగా రాష్ట్రమంతా ఇచ్చింది కేవలం 2 కోట్లే అన్నారు . విధంగా 17 లక్షల కుటుంబాలకు దళిత బందు ఇవ్వాలంటే 80 సంవత్సరాలు పడుతుందని వివరించారు . గిరిజనులకు , ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ కేవలం శాశనసభ లో తీర్మానాలకు పరిమితమైయ్యారని దెప్పిపొడిచారు . 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికీ బాండ్ల రూపంలో ఆదాయం కలిగి ఉన్న సింగరేణి నేడు 8 వేల కోట్లు అప్పుల కుప్పగా మారిందని పేర్కొన్నారు . ప్రశ్నపత్రాల లీకులు , లిక్కర్ స్కాం లతో రాష్ట్రం పరువు పోయిందని దుయ్యబట్టారు . ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. ఇక చందాల దందాలా వ్యవహారంపై మాట్లాడుతూ వాటికీ కాలం చెల్లిందని అలాంటి వారిని ప్రజలు ఏనాడో వెలివేశారని అన్నారు . ఈసభకు జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షత వహించారు. సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు , డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరు బ్రహ్మమయ్య , వెంకటేశ్వర రెడ్డి , చౌదరి , పాయం వెంకటేశ్వర్లు , స్వర్ణకుమారి , కోటా రాంబాబు , బొర్రా రాజశేఖర్ , సుతగాని జైపాల్ , గోసు మధు , పిడమర్తి రవి , దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ..

 

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం దీదీ ప్రయత్నాలు!

Drukpadam

టీఆర్ యస్ మీడియా సంస్థల ప్రతినిధులపై బీజేపీ నిషేధం ….

Drukpadam

విప‌క్ష నేత‌ల‌కు జేపీ న‌డ్దా ఫోన్‌… ముర్మును ఏక‌గ్రీవంగా ఎన్నుకుందామ‌ని పిలుపు!

Drukpadam

Leave a Comment