Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసిఆర్ పాలన అంటే లిక్కర్.. లీకేజీల పాలన…!

కేసిఆర్ పాలన అంటే లిక్కర్.. లీకేజీల పాలన…!

టీఎస్పీఎస్సీ లీకేజ్ పై సిబిఐతొ విచారణ జరిపించాలి

18 జరిగే మహా ధర్నాని జయప్రదం చేయండి

ప్రొఫెసర్ కోదండరాం

టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిబిఐ తో విచారణ జరిపించాలని, పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల పిలుపులో భాగంగా జరుగుతున్న దశలవారీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖమ్మం సంజీవరెడ్డి భవన్ లో కాంగ్రెస్, ప్రజాపంద న్యూ డెమోక్రసీలు, ఆమ్ ఆద్మీ, బిఎస్పి, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం వచ్చిన తెలంగాణలో నియమకాల ను ఎలక్షన్ సంవత్సరం 80% నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లను సైతం ఆదాయం గా మార్చి బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్న దుర్మార్గమైన పాలన కేసీఆర్ ది అని
ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలన మొత్తం కమిషన్లు దండుకోవటం తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. ఈ 8 ఏళ్ల పాలనలో కెసిఆర్ పాలనను లీకేజీ.. లిక్కర్ పాలనగా ఆయన అభివర్ణించారు. ఉపాధి ఉద్యోగాలు కోసం లక్షల మంది విద్యార్థులు కష్ట నష్టాలు కోర్చి చదువుతుంటే పాలకులు నిర్లక్ష్యం కారణంగా వారి జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన నియమకాలన్నీ కూడా పేపర్లు అమ్మి ఉద్యోగాలు అమ్ముకున్న దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండిందని , కెసిఆర్ పార్టీలను ప్రజలను నిరంతరం మోసం చేసే చేస్తున్నాడని ఆరోపించారు. 8 ఏళ్ల కాలంలో జరిగిన అన్ని నియమకాలపై సమగ్ర న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు, అనంతరం ప్రజా పంధా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వళ్ళ దుర్గాప్రసాద్, బిఎస్పి జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ సాహూ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం రాజేంద్రప్రసాద్, గిరిలు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుమలరావు లు మాట్లాడుతూ నిరుద్యోగుల గోష అఖిలపక్ష భరోసా యాత్ర పేరిట ఈ నెల 18 వ తారీఖు హైదరాబాదులో జరుగుతున్న అఖిలపక్ష మహాధర్నాలో వేలాది మందిగా ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అన్ని పార్టీల బృందం జిల్లా గ్రంథాలయంను సందర్శించి నిరుద్యోగులతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులు అఖిలపక్ష బృందానికి స్వాగతం పలికి గ్రంథాలయంలో ఉన్న సమస్యలను సవివరంగా వివరించారు. అనంతరం అఖిలపక్ష పార్టీల ధర్నాల కు తమ సంఘీభావం ఉంటుందని కార్యక్రమం పాల్గొంటామని విద్యార్థుల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, పీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, పల్లెబోయిన చంద్రం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నగర ఎస్. టి. సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి, తెలంగాణ జన సమితి నాయకులు గోపగాని శంకర్రావు, బాబు, ప్రజాపందా నాయకులు ఆవుల అశోక్, ఆజాద్ , వెంకటేష్ ,మస్తాన్, రాకేష్, రమేష్, ఉదయ్ విద్యార్థి యువజన మహిళా కార్మిక సంఘాల చెందిన నాయకులు పాల్గొన్నారు.

Related posts

జ‌గ‌న్‌కూ లేఖ రాసిన దీదీ… భేటీ ముగిశాక బ‌య‌టకొచ్చిన ఆహ్వానం!

Drukpadam

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

Drukpadam

హిమాచల్ ప్రదేశ్ నూతన సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు!

Drukpadam

Leave a Comment