Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అమ్మ జెడి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బిడ్డింగ్ వెనక ఇంత రాజకీయం ఉందా …?

అమ్మ జెడి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బిడ్డింగ్ వెనక ఇంత రాజకీయం ఉందా …?

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ: వీవీ లక్ష్మీనారాయణ
అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్న సీబీఐ మాజీ జేడీ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తన వంతు కృషి చేస్తానని స్పష్టీకరణ

మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వి వి లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ పై తరుచు తన గళం విప్పుతుంటారు… నిజంగా ఆయన చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు …కానీ ఆయన తన మనుసులో మాటను బయట పెట్టారు .తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు . దీంతో అమ్మ జెడి విశాఖ ఫ్యాక్టరీ అమ్మకానికి పెడితే బిడ్డింగ్ వేశావు అంటే అందులో పనిచేసే కార్మికులకు , ఉద్యోగులకు మేలు చేస్తావని అనుకున్నారు. కానీ నేను విశాఖ నుంచే పోటీచేస్తానని చెప్పడంపై ఇంత రాజకీయం ఉందా అని అంటున్నారు. గత ఎన్నికలల్లో ఇదే విశాఖ నుంచి జనసేన అభ్యర్థిగా లోకసభ కు పోటీచేశారు . తిరిగి విశాఖ నుంచే పోటీచేయాలని తలంపుతో ఉన్న జెడి అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు . ..

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని గుర్తు చేసిన ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని అన్నారు. అలాగే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా తనవంతు కృషి చేస్తానని అన్నారు.

1980వ సంవత్సరంలో వావిలాల గోపాలకృష్ణయ్య చేపట్టిన పైసా ఉద్యమ స్ఫూర్తితో ప్రతి తెలుగు కుటుంబం నెలకు రూ. 100 ఇస్తే రూ. 850 కోట్లు అవుతుందని, ఇలా నాలుగు నెలలపాటు నిధులు సేకరిస్తే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి స్టీల్‌ప్లాంట్ వెళ్లకుండా అడ్డుకోవచ్చని లక్ష్మీనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఓ ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

కర్ణాటక మంత్రి రాసలీలల వ్యవహారంలో కొత్త కోణం…

Drukpadam

పొంగులేటి రాజకీయ అడుగులపై ఆసక్తి ..

Drukpadam

రాజ్యాంగాన్ని కాదు.. కెసిఆర్ నే మార్చాలి: సీఎల్పీనేత భట్టి!

Drukpadam

Leave a Comment