Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇల్లు లేకపోయినా దేశమే నా ఇల్లు …ప్రజలే కుటుంబం కర్ణాటక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ

అధికారిక బంగ్లా ఖాళీ చేయించారు, నాకు ఇళ్లు అవసరం లేదు: రాహుల్ గాంధీ

  • రెండు రోజుల కర్నాటక పర్యటనను కుడాల సంగమం నుండి ప్రారంభించిన రాహుల్
  • శివాజీకి, బసవేశ్వరుడికి కాంగ్రెస్ నేత నివాళులు
  • లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆగ్రహం

మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్డు షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి.. ప్రజలకు అభివాదం చేశారు. చాలామంది రాహుల్, రాహుల్ అంటూ నినాదాలు చేస్తూ, బిగ్గరగా చీర్స్ చెబుతూ కనిపించారు. ఆయన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి పూలమాల వేసి రోడ్‌ షోను ప్రారంభించారు.

ఈ వాహనం శివాజీ సర్కిల్, కనకదాస సర్కిల్ నుండి డప్పుల చప్పుడుతో వివిధ ప్రాంతాల్లో రోడ్డు షోను నిర్వహించారు. రాహుల్ గాంధీ ఈ రోజు ముందుగా తన రెండు రోజుల కర్ణాటక పర్యటనను కుడాల సంగమం నుండి ప్రారంభించారు. అక్కడ ఆయన 12వ శతాబ్దపు కవి మరియు సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఈ రోజు బసవ జయంతిగా జరుపుకుంటారు.

కర్నాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ… తన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికార బంగ్లా ఖాళీ చేయించారని వాపోయారు. అయితే తనకు వందలాది మంది తన ఇంటికి రావాలని, తన ఇళ్లు తీసుకోవాలని లేఖలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనకు ఇళ్లు అవసరం లేదని, దేశమే తన ఇళ్లు అన్నారు.

Related posts

టీఆర్ యస్ ,బీజేపీ డ్రామాలతో రాష్ట్రానికి దక్కకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం…ఆరెస్పీ!

Drukpadam

రాహుల్ పై కురియన్ వాతలు…అధ్యక్షుడు అయితే అభ్యంతరం లేదని వ్యాఖ్య!

Drukpadam

సిపిఐ బలాన్ని ప్రతిబంబించేలా జూన్ 4 న కొత్తగూడెంలో సిపిఐ బహిరంగ సభ…కూనంనేని

Drukpadam

Leave a Comment