Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో రాజకీయ మంటలు …రేణుకాచౌదరికి దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని మంత్రి పువ్వాడ సవాల్…

ఖమ్మంలో రాజకీయ మంటలు …రేణుకాచౌదరికి దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని మంత్రి పువ్వాడ సవాల్…
-తనపై ఖమ్మంలో ఆమె గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలంజ్
-రేణుకా చౌదరి అంటేనే పబ్బులు ,గబ్బులు అంటూ మండిపాటు
-ఖమ్మం కు ఆమె చేసిందే ఏమిటో చెప్పాలని డిమాండ్
-రేణుకా చౌదరి చిల్లరి రాజకీయాలు ప్రజలకు తెలుసన్న పువ్వాడ
-ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి మాటలు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మరన్న మంత్రి
-కేసీఆర్ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం
-కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టికరణ

ఖమ్మంలో విపరీతంగా మండుతున్న ఎండలకు తోడు రాజకీయ మంటలు రాజుకున్నాయి . దీంతో ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి …అటు కాంగ్రెస్ ,ఇటు బీఆర్ యస్ నేతల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకున్నది చివరకు వ్యక్తిగత విమర్శలకు దారితీసింది . సోమవారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై వ్యక్తిగా విమర్శలు చేయడం రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.

మంత్రి అజయ్ ని రాజీవ్ గాంధీ హత్యకు ప్లాన్ వేసిన ఒంటి కన్ను శివరాసన్ గా పోల్చుతూ చేసిన విమర్శలపై మంత్రి పువ్వాడ మంగళవారం మమతా మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ సమావేశంలో దీటుగా బదులిచ్చారు . ప్రత్యేకించి రేణుకాచౌదరి పై నిప్పులు చెరిగారు . ఆమె పబ్బులు ,గుబ్బలు సంగతి తెలుసనీ ఆమెలా రాజకీయాల్లో నీచంగా ఉండేవారు అరుదుగా కనిపిస్తారని ధ్వజమెత్తారు . ఎక్కడ నుంచో వచ్చిన రేణుకాచౌదరిని ఆదరించి ఖమ్మం ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఒక్క పనైనేనా చేశారా అని నిలదీశారు .విజిటింగ్ ప్రొఫెసర్ లా జిల్లాకు అప్పుడప్పుడు వస్తు చేతులు ఊపుతూ తాను ఉన్నట్లు చెప్పుకుంటారని దుయ్యబట్టారు . అంతే కాదు ఆమె ఎన్నికలకు ముందు జిల్లాకు వస్తు టికెట్స్ ఇప్పిస్తామని చెప్పి ఏమి చేస్తున్నారో జిల్లా ప్రజలకు తెలియంది కాదని విమర్శలు గుప్పించారు . ఆమెకు దమ్ముంటే చేతనైతే ,ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు .ఆమె గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకుంటానని ,రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలంజ్ చేశారు . అందుకు ఆమె సిద్ధం కావాలని అన్నారు . ఆమె పోటీకి దూరంగా ఉంటూ వాళ్ళని ,వీళ్ళని వచ్చి పోటీచేయాలని కోరుతున్న విషయం వాస్తవం కదా ..? అని ప్రశ్నించారు .

ఇక రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చారు … ఓటుకు నోటు కేసులో విరుక్కొని స్వతంత్ర పోరాటయోదుడుగా పోజులు పెడుతూ ఇతరులపై నిందలు వేయడం అలవాటుగా పెట్టుకున్నారని విమర్శించారు . కాంగ్రెస్ నేతలరా …ఖబర్దార్ గుర్తుంచుకోండి మళ్ళీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ …రాష్ట్ర అభివృద్ధి ఆగదు …ప్రజలు కేసీఆర్ ను ముచ్చటగా మూడవసారి ఆశ్వీర్వదించడానికి సిద్ధగా ఉన్నారని అన్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కంచుకోట ఇక్కడ 10 కి 10 సీట్లు గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని పార్టీ కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు…ఈసమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , మేయర్ పూనుకొల్లి నీరజ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేతా , నాగరాజు , ఆర్జేసీ కృష్ణ ,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , పాల్గొన్నారు.

Related posts

ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ …బాదుడే బాదుడు తో చంద్రబాబు టూర్!

Drukpadam

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం …తాలిబన్ల చేతుల్లోకిఆఫ్ఘనిస్థాన్!

Drukpadam

కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలు అంటున్న కేశినేని నాని…

Drukpadam

Leave a Comment