ఈసారి 100 సీట్లు ఖాయం: సీఎం కేసీఆర్…
- తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ప్లీనరీ
- సర్వసభ్య సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్
- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడి
- సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ యస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ఎన్నికలపై ద్రుష్టి సారించారు . గెలిచే భాద్యత మీదే అని స్పష్టం చేశారు .పనితీరు బాగాలేకపోతే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని సున్నితంగా హెచ్చరికలు చేశారు .గెలుపు సమస్యగానే కాదు ఈసారి సీట్లు 100 రావాల్సిందే …ఇందుకోసం ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలనీ దిశా నిర్దేశం చేశారు . చిన్న చిన్న సమస్యలు ఉంటె వెంటనే పరిష్కరించుకొని ఎన్నికల్లో ఐక్యతతో పనిచేసి ఫలితాలను రావట్టలని అన్నారు . సిట్టింగ్ టికెట్స్ జరుగుతున్న ప్రచారం విషయంలో మరోసారి వారికీ అవకాశం ఉంటేందనే సంకేతాలు ఇచ్చారు . జాగ్రత్తగా పనిచేసుకోవాలని ఫలితం సరిగా రాకపోతే భద్యత తనది కాదని అన్నారు
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేడుకల సందర్భంగా పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తద్వారా, ముందస్తుపై ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పారు.
అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని స్పష్టం చేశారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టం అని కర్తవ్య బోధ చేశారు. సరిగా పనిచేయని ఎమ్యెల్యేలను ఉపేక్షిస్తానని అనుకోవద్దని హెచ్చరిక చేశారు. మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యతా అంశం కాదని, మునుపటి కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించుకున్నామని, ఈసారి 100 సీట్లు వస్తాయన్న ధీమా ఉందని పేర్కొన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్దేశించారు.
రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామని, పార్లమెంటరీ విధానంతో దేశంలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో నిరూపించామని పేర్కొన్నారు. తెలివి ఉంటే బండ మీద ఈకలు కూడా మొలిపించవచ్చని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. అమరులకు నివాళి అర్పించిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరులకు నివాళి అర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ కు ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హజరయ్యారు.
కేవలం ఆహ్వానం ఉన్న నేతలను మాత్రమే తెలంగాణ భవన్ లోకి అనుమతించారు. మొత్తం 279 మందికి ఆహ్వానం అందింది. వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మరోవైపు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.