Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ పతనమవుతున్నారు: ఏపీ మంత్రి

చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ పతనమవుతున్నారు: ఏపీ మంత్రి

  • టీడీపీతో కలిస్తే జనసేన కూడా పతనమవడం ఖాయమని వ్యాఖ్య
  • రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలని సూచన
  • ఎన్టీఆర్ అభిమానులు అంతా వైసీపీ వెంటే ఉన్నారన్న మంత్రి

తెలుగుదేశం, జనసేన పార్టీలపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరించి పోతున్న తెలుగు దేశం పార్టీతో కలిస్తే జనసేన కూడా పతనమవడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్మి పవన్ కళ్యాణ్ రాజకీయంగా దిగజారిపోతున్నాడని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారనే ప్రచారం పై కూడా ఆయన స్పందించారు.

అసలు, ముందు రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తేల్చుకోవాలన్నారు. ముందు మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి అని నిలదీశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులు అందరు కూడా వైసీపీలోనే ఉన్నారని చెప్పారు. ప్రజలను అశాంతికి గురి చేసేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని భగ్గుమన్నారు.

Related posts

బీఆర్ఎస్ కు ఈసీ ఆమోదంపై ఢిల్లీ హైకోర్టుకు: రేవంత్ రెడ్డి!

Drukpadam

2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా: నారా లోకేశ్!

Drukpadam

బీజేపీపై పోరుకు విప‌క్షాల స‌న్న‌ద్ధం… 12 పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న‌!

Drukpadam

Leave a Comment