Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎర్రజెండా సాక్షిగా …67 ఏళ్ళ ప్రయాణం పువ్వాడ సీనియర్ ది…

ఎర్రజెండా సాక్షిగా …67 ఏళ్ళ ప్రయాణం పువ్వాడ సీనియర్ ది
మేడే అంటే మమకారంఎర్రజెండాతో విడదీయరాని బంధం ఆయనది
నాటినుంచి ప్రతి మేడే వేడుకల్లో పాల్గొన్న పువ్వాడ
ఇటీవల ఆనారోగ్యానికి గురై కోలుకున్న పువ్వాడ
డాక్టర్లు , కుటుంబసభ్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచన
మేడే వేడుకల్లో పాల్గొనాలని పట్టుదలతో సిపిఐ కార్యాలయానికి వచ్చిన పువ్వాడ
ఆత్మీయ స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు
పువ్వాడ రాకతో పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం ..

పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ కురువృద్ధుడు …”సిపిఐ అంటే పువ్వాడ పువ్వాడ అంటే సిపిఐ” అనే విధంగా తన ముద్రను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేసుకున్న రాజకీయ ఉద్దండుడు …ఎర్రజెండాతో ఆయనది 67 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం…మేడే అంటే మమకారం …ఎర్రజెండాతో విడదీయరాని బంధం ఆయనది …నాటినుంచి ప్రతి మేడే వేడుకల్లో పువ్వాడ పాల్గొంటున్నారు .86 వయసు లోను ఆయన జ్ణాపకశక్తి అమోఘం … చాల రోజుల తర్వాత ఖమ్మం వచ్చిన ఆయన పార్టీ కార్యకర్తలను ,నాయకులను జర్నలిస్టులను ఆప్యాయంగా పలకరించారు .

1938 లో జన్మించిన పువ్వాడ న్యాయశాస్త్రం అభ్యసించారు . ..అయినప్పటికీ కమ్యూనిస్ట్ రాజకీయాలకు ఆకర్షితుడైన పువ్వాడ 1956 లో తన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ పూర్తీ కాలం కార్యకర్తగా భాద్యతలు స్వీకరించారు . మొదట భద్రాచలం ప్రాంతంలో పూర్తికాలం పనిచేసిన పువ్వాడ తర్వాత పార్టీ అవసరాల దృష్ట్యా ఖమ్మం కు మకాం మార్చారు . ఆయన పార్టీలో చేరిన నాటినుంచి గత 67 సంవత్సరాలుగా ప్రతి మేడే కార్యక్రమంలో పాల్గొని రికార్డ్ సృష్టించారు. ఎన్ని పనులు ఉన్న క్రమం తప్పకుండ పాల్గొన్నారు . ఇటీవల పువ్వాడ ఆనారోగ్యానికి గురికావడంతో హైద్రాబాద్ లో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్నారు . మేడే వేడులకు వెళ్లవద్దని విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు . కుటుంబ సభ్యులు సైతం ఎక్కడకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండాలని అన్నారు . కానీ మేడే కార్యక్రమాల్లో తప్పకుండ పాల్గొనాలని తన ప్రాణం ఉన్నంతవరకు ఎర్రజెండా కు శాల్యూట్ చేస్తూనే ఉంటానని చెప్పి ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొని ఎర్రజెండా వేగరవేశారు . తమ ప్రియతమ నాయకుడు పువ్వాడ మేడే ఉత్సవాల్లో పాల్గొనడంతో కార్యకర్తలు ,నాయకులు తమ అభిమాన నాయకుడికి జైజైలు పలికారు . ఆయన నిండా నూరేళ్లు తమ మధ్యనే ఉండాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు .

సిపిఐ సీనియర్ నేత పువ్వాడకు జర్నలిస్టుల అభినందనలు

సంపూర్ణ ఆరోగ్యంతో సోమవారం ఖమ్మం చేరుకొని జిల్లా సిపిఐ కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం(మే) డే వేడుకల్లో పాల్గొన్న సిపిఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు ను ప్రేమపూర్వకంగా కలిసి తమ అభినందనలు తెలియజేశారు . తమకు వెల్లప్పుడు అండదండలుగా ఉంటూ జర్నలిస్టుల పక్షపాతిగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసి అభినందించారు . 100 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడుపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు .

ఖమ్మం ప్రజలంతా పెద్దాయనగా భావించే శ్రీ పువ్వాడ నాగేశ్వరరావు ని కలిసి అభినందనలు తెలిపిన టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్ట్ యూనియన్ నాయకుల్లో రాష్ట్ర ఉపాధ్యక్షడు కె .రాంనారాయణ , జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు , ఏనుగు వెంకటేశ్వరరావు ,నేషనల్ కౌన్సిల్ సభ్యులు సామినేని కృష్ణ మురహరి , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్ , రాష్ట్ర నాయకులు నేర్వనేని వెంకట్రావు , నలజాల వెంకట్రావు, మొహినుద్దీన్ ,ఏగినాటి మాధవరావు , చారి , పురుషోత్తం , మేడి రమేష్ , ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ రావు , కనకం సైదులు , నగర అధ్యక్ష ,కార్యదర్శులు మైస పాపారావు , చెరుకుపల్లి శ్రీనివాస్ రావు , ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు .

 

Related posts

చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే పళ్లు ఇవిగో!

Drukpadam

యాదాద్రిలో ప్రవేట్ హెలికాఫ్టర్ కు పూజలు …ఎగబడ్డ జనం

Drukpadam

సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్ల పరుగు.. చైనా వ్యక్తి రికార్డు!

Drukpadam

Leave a Comment