Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పుతిన్ హత్యకు కుట్ర…క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి..

క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి.. పుతిన్ హత్యకు కుట్ర.. తమకు సంబంధం లేదన్న ఉక్రెయిన్..!

  • క్రెమ్లిన్ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లను కూల్చేసిన రష్యా
  • ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్రదాడేనన్న క్రెమ్లిన్
  • అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
  • ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్పష్టీకరణ
  • ఇలాంటి దాడికి తాము పాల్పడబోమన్న ఉక్రెయిన్
  • అది మిలటరీ లక్ష్యాలను పరిష్కరించబోదని స్పష్టీకరణ

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధానికి తెరపడడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తుండగా, ఉక్రెయిన్ చేతనైనంతగా అడ్డుకుంటూ రష్యాను నిలువరిస్తోంది. తాజాగా, ఈ రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా, రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను రష్యా కూల్చివేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకే వీటిని ప్రయోగించిందని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్‌పై దాడికి యత్నించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా తెలిపింది. అంతేకాదు, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనింది.

డ్రోన్ల దాడి నుంచి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. అలాగే, క్రెమ్లిన్ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్ర దాడి అని, అధ్యక్షుడి ప్రాణాలను హరించేందుకే పన్నిన కుట్ర అని ఆరోపించింది. డ్రోన్ దాడి జరిగినప్పుడు పుతిన్ ఆ భవనంలో లేరని పేర్కొంది.

రష్యా ఆరోపణపై ఉక్రెయిన్ స్పందించింది. ఆ డ్రోన్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికార ప్రతినిధి మిఖాయ్లో పోడోల్యాక్ తెలిపారు. క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ దాడిచేయబోదని, ఎందుకంటే మిలటరీ లక్ష్యాలను అది పరిష్కరించలేదని పేర్కొన్నారు.

Related posts

జర్నలిస్ట్ ల సమస్యలను ప్రధాన మంత్రికి దృష్టికి తీసుకు వెళ్తా … కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !

Drukpadam

గతంలో పనిచేసిన అధికారులు కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

Drukpadam

వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌దు: కేంద్ర ఎన్నిక‌ల సంఘం!

Drukpadam

Leave a Comment