Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూను ఈ నెలాఖరువరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూను ఈ నెలాఖరువరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం…

కరోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు
ఆర్థిక సాయంపై కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాం
క‌నీసం నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉంటేనే స‌రైన ఫ‌లితాలు
గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో క‌ర్ఫ్యూను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… ఏపీలో క‌ర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్ర‌మే అవుతోంద‌ని చెప్పారు. క‌నీసం నాలుగు వారాలు క‌ర్ఫ్యూ ఉంటేనే స‌రైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆయ‌న తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కరోనాతో అనాథ‌లైన పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు చ‌ర్య‌లు తీసు‌కుంటామ‌ని,వారికి ఆర్థిక సాయంపై కార్యాచ‌ర‌ణ రూపొందిస్తామ‌ని చెప్పారు. కాగా, ఏపీలో క‌ర్ఫ్యూ విధించిన‌ప్ప‌టికీ కొవిడ్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృభిస్తుంది. నిన్న ఒక్క రోజులోనే 24 వేల కేసులు నమోదు కావడం , 100 మందికి పైగా చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది.అందువల్ల కర్ఫ్యూ పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది.

 

ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ సీఎం ఆదేశం : మంత్రి ఆళ్ల నాని

కరోనా రోగులకు ముప్పు కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్
ప్రాణాలు కూడా పోయే ప్రమాదం
బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స
రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేస్తున్నట్టు తెలిపిన ఆళ్ల నాని
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై స్పందించారు. కరోనా రోగుల పాలిట పెనుముప్పుగా పరిణమించిన బ్లాక్ ఫంగస్ సమస్యను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ కారణంగా కరోనా రోగులు కంటిచూపు పోగొట్టుకోవడమే కాకుండా, కొన్నిసార్లు మృత్యువాత కూడా పడుతున్నారు.

ఈ నేపథ్యంలో, బ్లాక్ ఫంగస్ పై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇకపై బ్లాక్ ఫంగస్ సోకినవారికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. మరోపక్క, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారని వివరించారు.

గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్ సర్వే చేపడుతున్నామని, తద్వారా కరోనా బాధితులను గుర్తించడం సులువు అవుతుందని అన్నారు. సర్వేలో గుర్తించిన పాజిటివ్ వ్యక్తులను వారిలో లక్షణాల తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడం వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Related posts

బ్రిటన్‌లో ఒకే రోజు 93 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు

Drukpadam

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాల గరిష్ఠ ధరను నిర్ణయించిన కేంద్రం…

Drukpadam

ఆస్ట్రేలియాలో హింసాత్మకంగా మారిన టీకా వ్యతిరేక నిరసనలు…

Drukpadam

Leave a Comment