Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ సర్కార్ పై విజయశాంతి ఫైర్…

తెలంగాణ సర్కార్ పై విజయశాంతి ఫైర్…
– ఎటుచూసినా వైఫల్యాలే అని ఘాటు విమర్శ
-పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళిక సర్కారుకు లేదని విమర్శ
-గతంలోనే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని వివరణ
-వ్యాక్సినేషన్ ఎందుకాపేశారని ప్రశ్న
-కరోనాను ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చలేదని విమర్శలు
బీజేపీ నేత విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్నా తాజా పరిస్థితులపై ఆమె ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎటుచూసినా వైఫల్యాలే తప్ప, పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ప్రణాళిక కనిపించడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పై ప్రభుత్వ సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుగ్గా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదని తెలిపారు.

రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సిన్ డోసుల నిల్వ ఉన్నా, గత 3 రోజుల నుంచి వ్యాక్సినేషన్ ఆపేశారని విజయశాంతి ఆరోపించారు. “కరోనాను ఇప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చలేదు, ఆయుష్మాన్ భారత్ అమలు కావడంలేదు…. కరోనా కట్టడిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలా ఉంది” అని విమర్శించారు.

మరోవైపు, మల్లాపూర్ కు చెందిన నిండు గర్భిణీని చేర్చుకోవడానికి 5 ఆసుపత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోందని తెలిపారు. ఎంతోమంది బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విజయశాంతి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

అటు, తెలంగాణ రైతు మరోసారి కడగండ్ల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలులో తెలంగాణ సర్కారు ఉదాసీన వైఖరి ప్రదర్శించడంతో, ధాన్యం వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారని ఆమె తెలిపారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు చెప్పట్టాలని డిమాండ్ చేశారు.

Related posts

రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల చిందులు…

Drukpadam

బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే:కపిల్‌ సిబల్‌…

Drukpadam

సుష్మా స్వరాజ్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ…!

Drukpadam

Leave a Comment