Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ….తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం …

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ….తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం
జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు గల్లంతుగుమ్మనంగా అధికార బీఆర్ యస్
కంగుతిన్న బీజేపీమోడీ ,షాల జోడి పై సన్నగిల్లుతున్న ఆశలు
కర్ణాటక ,తరువాత తెలంగాణ అన్న బీజేపీకి ఎదురుదెబ్బ
రాష్ట్రంలో జోరు పెంచిన కాంగ్రెస్ఢీలా పడ్డ బీజేపీ

కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగించాయి…. త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై వీటి ప్రభావం పై చర్చలు జరుగుతున్నాయి. జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు గల్లంతు కాగా …బీఆర్ యస్ ఈ ఎన్నికల ఫలితాలపై గుమ్మనంగా ఉంది .డబుల్ ఇంజన్ సర్కార్ అని ఊదరగొట్టిన బీజేపీ కంగుతినగా…మోడీ ,షా లపై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణ బీజేపీకి ఎదురు దెబ్బగానే భావించవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫలితాలతో కాంగ్రెస్ జోరు పెంచగా బీజేపీ ఢీలా పడింది …

కర్ణాటక ఎన్నికల్లో ఎవరికీ వచ్చినా బొటాబొటి మెజార్టీ వస్తుందని , బజరంగ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పినందున చివర రోజుల్లో ప్రజల్లో మార్పు వచ్చిందని అందువల్ల బీజేపీ గతంలో కంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. కొంతమంది మేధావులు సైతం సర్వే ల ప్రకారం ఫలితాలు రాకపోచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు . 2018 ఎన్నికలు రిపీట్ అవుతాయని జేడీఎస్ కు వచ్చే సీట్ల కీలకమై వారు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారని భావించారు . ఎన్నికల ఫలితాలు వస్తుండగానే హైద్రాబాద్ లో కొన్ని స్టార్ హోటల్స్ లో రూంలు బుక్ చేశారని వార్తలు వచ్చాయి. హోటల్స్ బుక్ చేసింది కేసీఆర్ అని అది జేడీఎస్ కోసమేనని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హంగ్ వస్తే తన చాణిక్యం ద్వారా, తాను అనుకున్న పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా జేడీఎస్ ను అధికార పీఠం పై కూర్చోబెట్టడం చేయాలనీ కన్న కలలు నెరవేర లేదు . అనేక మంది అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ సింగిల్ గానే 43 శాతం ఓట్లతో 135 సీట్లను గెలుచుకొని తిరుగులేని మెజార్టీ సాధించి, రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేసింది. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని , వెంటి లెటర్ పై ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారాన్ని కన్నడనాట ప్రజలు తిప్పికొట్టారు . బీజేపీ 36 శాతం ఓట్లతో 65 సీట్లకు జేడీఎస్ 13 శాతం ఓట్లతో 19 సీట్లకు పరిమితమైంది . కాంగ్రెస్ కు కొత్త జవసత్వాలు వచ్చాయి. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రభావం కూడా ఓటర్లపై పడిందనేది ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వంపై వేసిన అనర్హత వేటును మతాలు, కులాలు ,ప్రాంతాలు ఏవైనా మెజార్టీ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా బీజేపీ పాలకులు దీన్ని అర్థం చేసుకోవాలి … పైగా రాహుల్ గాంధీ కేసులో తీర్పు చెప్పిన జడ్జికి ప్రమోషన్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు బీజేపీని డ్యామేజ్ చేశాయి.

ఇక ఈ ఎన్నికల ఫలితాలు దేశంలో , ప్రధానంగా త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందా …? ఉండదా అని చర్చోప చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటకకు తెలంగాణ కూడా ఒక సరిహద్దు ప్రాంతం …అందువల్ల తప్పకుండ అక్కడ ఎన్నికల ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . కర్ణాటక జనాభా ఐదున్నర కోట్లు అందులో కోటిమంది తెలుగు వారు ఉంటారని అంచనా ..ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలతో అక్కడ ప్రజలకు సంబంధాలు ,బంధాలు , బంధుత్వాలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్ వెర్ ఉద్యోగులు అనేకమంది బెంగుళూర్ లోనివాసం ఉంటున్నారు . అందువల్ల ఏరకంగా చూసిన కర్ణాటక ఎన్నికల ప్రభావాన్ని తెలంగాణ లో కొట్టి పారేసే వీలు లేదు . ఇది ఇక్కడ పాలకులకు కూడా అర్థమైంది కానీ అలాంటిది ఏమి ఉండదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు . బీఆర్ యస్ ను గద్దెనెక్కకుండా చేద్దామనే పట్టుదలతో ఉన్నవాళ్లు తమ రాజకీయ ఆలోచనలకు పదును పెట్టారు ….

అభివృద్ధి ,ప్రజల సంక్షేమం , పేదల భాదలు తీర్చడం కాకుండా మతం, కులం ప్రాంతం అంటూ రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న పార్టీలకు కర్ణాకట ఎన్నికల ఫలితాలు గుణపాఠం చెప్పాయి. పైగా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి అవినీతి సర్కార్ గా ముద్రపడింది . ఇది ప్రజల్లో నాటుకొని పోయింది .బీజేపీ కేంద్ర నాయకత్వం మొత్తం వచ్చి అక్కడ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రధాని మోడీ ఒక్క బెంగుళూరు లోనే మూడు రోజులు మకాంవేసి విస్తృత ప్రచారం చేశారు . రోడ్ షో లు నిర్వహించారు . ఆయన రోడ్ షో సందర్భంగా చల్లిన పూల ఖర్చు కోటి రూపాయలవరకు ఉంటుందని ప్రచారం జరిగింది. నిజంగా ఎంత ఖర్చు చేశారో తెలియదు కానీ ఇది నెగిటివ్ అయింది…

మనది లౌకిక రాజ్యం ,అన్ని మతాలకు ,కులాలకు సమాన రక్షణ ఉంటుందని మన రాజ్యంగంలో రాసుకున్నాం .కానీ ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి అన్నం పెట్టె బదులు మతాల ద్వారా ,కులాల ద్వారా కడుపు నిండుతుందని చెప్పే విషపూరితమైన సంస్కృతిలో మనం ఉన్నామనే విషయాన్నీ మర్చిపోరాదు..మన రాజ్యాంగ నిర్మాతలు దేశంలో అన్ని కులాలను , మాటలను ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధ్వరంలో రూపొందించిన రాజ్యాంగం అనేక దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది. దాన్ని పూర్తిగా మార్చాలని కొందరు . అందులో ఉన్న వాటిని బలహీన పర్చడం ద్వారా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను తెరమరుగు చేయాలనీ మరికొందరు చూస్తుండటం దేశానికి పెద్ద ప్రమాదకరంగా మారబోతుందనే ఆందోళనలు ఉన్నాయి . ప్రజలు గుడ్డివాళ్ళని, మనం చెప్పిందే వేదమని, వారు ఆచరించి తీరాల్సిందేనని అనుకోవడం పొరపాటని చరిత్ర చెపుతున్న సత్యం …దీన్ని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి … ఎవరి మతాలు వారివి ,ఎవరి కులాలు వారివి వారి వారి సంస్కృతి ,సంప్రదాయాలను గౌరవిస్తూనే వారికీ రక్షణ కల్పించాల్సిన భాద్యత పాలకులపై ఉంది … కర్ణాటకలో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పాలన ఉందనే బీజేపీని ఇంటికి పంపించారనేది గుర్తుంచుకోవాలి …

Related posts

రాష్ట్రంలో పంట రుణాల్లో కోత … సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు!

Drukpadam

సర్వదర్శన టోకెన్లకు ఎగబడిన భక్తజనం.. తోపులాట జరిగి పలువురికి గాయాలు

Drukpadam

కోడలిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చిన దళిత కుటుంబం…

Drukpadam

Leave a Comment