Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వ విధానాలతో గిరిజన హక్కులకు భంగం …జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ కు గిరినసంఘం వినతి …

కేంద్ర ప్రభుత్వ విధానాలతో గిరిజన హక్కులకు భంగం …జాతీయ గిరిజన కమిషన్ చైర్మన్ కు గిరినసంఘం వినతి …
-అటవీ నియమాల చట్టాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోండి …
-పోడు సాగు చేస్తున్న గిరిజలందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలి …
-ఖమ్మం జిల్లా గిరిజనలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి ….
-జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు ఆనంత్ నాయక్ వివరించి గిరిజన సంఘం నేతలు …

ఖమ్మం పర్యటన విచ్చేసిన జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు ఆనంత్ నాయక్ ఖమ్మం ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో గిరిజన సంఘాలు ఎన్జీవోలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యతిరేక చట్టాల గురించి వివరించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి అనేక సమస్యలను భూక్యా వీరభద్రం వివరించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అటవీ నియమాల చట్టం పేరుతో ఉన్న చట్టాలను తూట్లు పొడిచే విధంగా కుట్ర చేస్తుందని పోడు భూములకు కేంద్ర ప్రభుత్వం చొరవతో అందరికీ హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ రంగంలో గిరిజనకు రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేయాలని కోరారు. ఐటీడీఏ ద్వారా పెండింగ్లో ఉన్న రోడ్లు కొనిజర్ల మండలం మేకల కుంట నుండి జంపాలనగర్ గద్దల గూడెం నుంచి విక్రమ్ నగర్ తారు రోడ్డు ఆరు సంవత్సరాల క్రితం మంజూరై ఇప్పటికీ పనులు ప్రారంభం చేయలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు, ఖమ్మంలో గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కొరకు ఐటిడిఏ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఏజెన్సీ గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేసే విధంగా గిరిజన హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు జిల్లా వ్యాప్తంగా 20 సమస్యలను రాతపూర్వకంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు దీనిపై కమిషన్ సభ్యులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గిరిజన సంఘం నేత భూక్య వీరభద్రం లేవనెత్తిన సమస్యలను రేపు జరిగే జిల్లా అధికారుల రివ్యూ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి నివేదిక అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు తేజావత్ కృష్ణ కాంత్ ,ధరావత్ నంద్యా నాయక్, ధరావత్ మాన్ సింగ్ నాయక్ ,బానోతు శ్రీనివాసరావు, భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీలో బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం వద్ద బ్యారికేడ్ల తొలగింపు…

Drukpadam

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం …!

Ram Narayana

విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్ కు వినితి పత్రం…

Drukpadam

Leave a Comment