Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిపిఐ బలాన్ని ప్రతిబంబించేలా జూన్ 4 న కొత్తగూడెంలో సిపిఐ బహిరంగ సభ…కూనంనేని

సిపిఐ బలాన్ని ప్రతిబంబించేలా జూన్ 4 కొత్తగూడెంలో సిపిఐ బహిరంగ సభకూనంనేని
హాజరు కానున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డి .రాజా
కర్ణాటక ఎన్నికలు బీజేపీ మతరాజకీయాలకు చెంపపెట్టు
దశబ్దకాలంలో మొదటిసారిగా మోడీ షా జోడీపై నీలి నీడలు
ప్రజా చైతన్యంతోనే మార్పు నిరూపించిన కర్ణాటక ప్రజలు
చావు దెబ్బతిన్న మేకపోతు గాంబీర్యం

కార్మికుల ,కర్షకుల గడ్డ సింగరేణి కేంద్రమైన కొత్తగూడెంలో జూన్ నెల 4 సిపిఐ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు .సోమవారం ఖమ్మం జిల్లా సిపిఐ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ సిపిఐ బలాన్ని ప్రతిబంబించేలా ఈసభ జరుగుతుందన్నారు . అనేక కార్మిక ఉద్యమాలకు నిలమైన కొత్తగూడెం లో సిపిఐ పార్టీ తన సత్తా చాటుతుందని పేర్కొన్నారు . మతరాజకీయాలను అడ్డం పెట్టుకొని ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు . కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ తొక్కని అడ్డదారిలేదని అయినప్పటికీ కర్ణాటక ప్రజలు ఆపార్టీకి కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు .దేశంలో మోడీ ,షా జోడికి తిరుగులేదని ఇంతకాలం డప్పు కొట్టుకుంటా వచ్చిన బీజేపీకి ఆజోడితో పసలేదని తేలిందన్నారు . ప్రజల సంక్షేమాన్ని విస్మరించి ప్రతిచోటా మతకలహాలు తో కాలంగడుపుతున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని బీజేపీ విధానాలపై కూనంనేని ధ్వజమెత్తారు .

దేశవ్యాప్తంగా బిజెపికి తిరోగమనం ప్రారంభమైందని ,రాజకీయాలను, మతాన్ని కలిపి లబ్ది పొందాలని చూసిన బిజెపికి కర్నాటక ప్రజలు తగు గుణపాఠం చెప్పారన్నారు. బిజెపి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు దిగజారుడు విధానాలను అవలంభిస్తుందని ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. ఆర్థికంగా దేశాన్ని దివాళా తీయించిన బిజెపి మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య విభజన తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కర్నాటకలో అమిత్, మోడీల ఎత్తుగడలు పని చేయలేదని రానున్న కాలంలో దేశ వ్యాప్తంగా బిజెపికి ఇదే పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ప్రజాచైతన్యంతోనే మార్పు ప్రారంభమవుతుందన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో బిజెపికో హఠావో దేశికో బదావో అనే నినాదంతో గ్రామ గ్రామాన సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రకు విశేష స్పందన లభించిందన్నారు. లక్షలాది మందికి పార్టీ సందేశాన్ని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాన్ని, ప్రస్తుత రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. రానున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచేందుకు పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సమితి నిర్ణయించిందన్నారు. జూన్ నాలుగున కొత్తగూడెంలో జరిగే బహిరంగ సభ జయప్రదానికి గ్రామ స్థాయి నుంచి సభలు, సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తామన్నారు . బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు కె. నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, గోరేటి వెంకన్న తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. మహమ్మద్ మౌలానా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎస్ కె జానిమియా, గోవిందరావు, ఎపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ అవినీతిపై విచారణ జరపండి …సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు …

Drukpadam

వికేద్రీకరణ పై ఏపీ వ్యూహాత్మక అడుగులు …పూర్తిసమగ్రమైన మెరుగైన బిల్లు తెస్తాం :సీఎం జగన్

Drukpadam

యూపీ లో బీజేపీకి ఓటు వేయకపోతే …తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment