Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజురాబాద్ పై కేంద్రీకృతమైన రాజకీయ తుఫాన్!

హుజురాబాద్ పై కేంద్రీకృతమైన రాజకీయ తుఫాన్
-ఈటల వర్సెస్ టీఆర్ యస్
-రెండుగా చీలిన నియోజకవర్గ ప్రజలు
-గంగుల కమలాకర్ తో వరస భేటీలు
-ఈటలను కలుస్తున్న అభిమానులు
ఎత్తులు పై ఎత్తులతో హీటెక్కుతున్న నియోజకవర్గ రాజకీయం
తెలంగాణాలో ఇటీవల భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ను నియోజకవర్గంలో బలహీన పరిచేందుకు టీఆర్ యస్ పావులు కదుపుతుంది………..
ఇప్పటివరకు కలిసి మెలిసి పని చేసిన నియోజవర్గ ప్రజలు రెండుగా చీలిపోయారు……నియోజకవర్గంలో ఈటల వర్సెస్ టీఆర్ యస్ గా మారింది…….. పై చేయి సాదించేందుకు రెండువైపుల నుంచి ఎత్తులు పైఎత్తులు వేస్తుండటంతో హుజారాబాద్ నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి…….. అందులో భాగంగానే నియోజవర్గానికి సంబందించిన వ్యవహారాలు చేసే భాద్యతను మంత్రి గంగుల కమలాకర్ పై పెట్టింది. ఆయన నియోజవర్గ నాయకులతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు……. గత 20 సంవత్సరాలుగా అక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈటల ప్రజలతో మంచి సంభందాలు కలిగి ఉన్నారు. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించిన విషయం విదితమే . ప్రస్తుతం ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. . రేపోమాపో దానికి ఆయన రాజీనామా చేయడమా ? లేక పార్టీనే ఆయన్ను సస్పెండ్ చేయడమా ? జరిగిపోతుంది . ఇక్కడ ఎన్నికలు రావడం అనేది ఏదైనా అనుకోని సంఘటనలు,రాజకీయమార్పులు జరిగితే తప్ప అనివార్యం . అందుకు ఇటు ఈటల అంటూ టీఆర్ యస్ పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఈటల మంత్రివర్గం నుంచి భర్తరఫ్ అయిన మరు క్షణమే మీడియా తో మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవి విషయంలో నియోజవర్గ ప్రజలతో చర్చించిన తరువాత నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు . ఆయన మే 3 న నియోజకవర్గానికి వెళ్లారు అక్కడ ప్రజలతో భేటీ అయ్యారు . కార్యకర్తలతోను , తన అభిమానులతో మూడు రోజుల పాటు ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ,ఇది నా ఆత్మగౌరవానికి సంభందించిన విషయమని చెప్పారు.ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది పార్టీ సస్పెండ్ చేయాలనీ ఆయన ,ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ పార్టీ చూస్తుంది. రెండువైపుల నుంచి హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమనే సంకేతాలే ఉన్నాయి. కాకపోతే నియోజవర్గంలో ఈటల ను బలహీన పరచాలని కేసీఆర్ వ్యూహంగా ఉంది. దాన్ని అమలు చేసే భాద్యతను గంగుల కమలాకర్ కు అప్పగించారు. ఆయన ప్రస్తుతం దానిలో బిజీగా నే ఉన్నారు. ఇప్పటికే కొంత మంది మొదట రాజేందర్ కు అనుకూలంగా ఉన్న వాళ్ళు గంగులతో భక్తి అయ్యారు , రెండు మండలాల వాళ్ళు టీఆర్ యస్ వైపు చేరారు. మరికొంత మంది కోసం గాలం వేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు , మండల అధ్యక్షులు , జడ్పీ టి సి లలో కొందరు వ్యక్తి కన్నా పార్టీ నే ముఖ్యమన్నారు. జమ్మికుంట మండలంలో మాత్రం ఈటల వెంటే తామంతా అని మీడియా సమావేశం పెట్టి చెప్పారు. అయితే రాజేందర్ దీనిపై స్పందిస్తూ తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంభందం లేని వ్యక్తి ఇప్పుడు ఉద్యమకారులపై పెత్తనం చేస్తున్నారని పరోక్షంగా గంగుల కమలాకర్ ను గురించి వ్యాఖ్యానించారు. గంగుల ఈటలపై మండిపడ్డారు . తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని,తనపై కేసులు కూడా ఉన్నాయని వివరణ ఇచ్చుకున్నారు. గుర్రెల గుంపుపై ,తోడేళ్ళు పడ్డ చందంగా కేసీఆర్ తన వ్యూహాలను తమపై ప్రయోగిస్తున్నారని ఈటల ఘాటుగానే స్పందించారు . దీంతో ఎత్తులు పైఎత్తులతో హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. రాజకీయతుఫాన్ హుజురాబాద్ పై కేంద్రీకృతం అయింది. ఎమ్మెల్యేకు ఎన్నిక రావడం ఖాయం అయితే ఇక్కడ పోటీ ఎవరు అనేది టీఆర్ యస్ అన్వేషణలో ఉంది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతారావు మనవడు బరిలో నిలిచే ఆవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరో పక్క రెడ్డి సామజిక వర్గానికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో టీఆర్ యస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ కు చెందిన నియోజవర్గ ఇంచార్జి మంత్రివర్గం నుంచి ఈటల భర్తరఫ్ అయిన దగ్గరనుంచి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ ఆలోచనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించడంపై కాంగ్రెస్ లోనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ యస్ లో వచ్చిన వైరుధ్యాలను ఉపయోగించుకునే బదులు అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం పై ఆపార్టీ లోనే చర్చ జరుగుతుంది. హుజురాబాద్ లో మన పార్టీ లైన్ ఏమిటని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర అధ్యక్షుడిని అడగటంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈటల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు . దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరతారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఆయన అన్ని పార్టీలలోని ముఖ్య నాయకులను కలుస్తున్నారు. హుజారాబాద్ పై ఇప్పటి వరకైతే మంచి పట్టు కలిగి ఉన్నారు. తన నిర్ణయం ఎలా ఉంటుందనే విషయంలో ఒక క్లారిటీ ఇప్పటి వరకు లేదు.దీనిపై ఈటలను అభిమానించే వారు సైతం పార్టీ ఇంట అవమానించిన తరువాత ఒక నిర్ణయానికి రావాలని ఆయన పై వత్తిడి తెస్తున్నారు. ఆయన రెండవసారి నియోజవర్గ ప్రజలను కలిసేందుకు నేడో రేపో రానున్నారని తెలుస్తుంది. మరి ఏమి జరుగుతుందో చూద్దాం !

Related posts

నాపై అసత్య ప్రచారాలు మాని మీగురించి పార్టీ గురించి చూసుకోండి ..కేశినేని నానికి సీఎం రమేష్ హితవు …

Drukpadam

టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా!

Drukpadam

ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం …తాలిబన్ల చేతుల్లోకిఆఫ్ఘనిస్థాన్!

Drukpadam

Leave a Comment