Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణ పర్యటన…

త్వరలో జేపీ నడ్డా, అమిత్ షా తెలంగాణ పర్యటన…

  • ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్
  • నెల రోజుల పాటు జరగనున్న కార్యక్రమం
  • ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో చెరో ఒక బహిరంగ సభ
  • ఈ సభలకు జేపీ నడ్డా, అమిత్ షా హాజరు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తెలంగాణలో నిర్వహించే రెండు బహిరంగ సభల్లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. నెల రోజుల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించంది. ఇందులో భాగంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో చెరో ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ పార్టీ పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు ఏర్పాటు చేశామని, వీటిల్లో భాగంగా ఈ వర్చువల్ సమావేశం కూడా ఏర్పాటు చేశామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో లక్ష మంది ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇందుకోసం 250 మంది ప్రముఖులను ఎంపిక చేసినట్టు తెలిపారు.

Related posts

హుజూరాబాద్ ఉపఎన్నిక..అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ…

Drukpadam

రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు.. స్మార్ట్‌మేన్:రఘురామ్ రాజన్ ప్రశంసలు

Drukpadam

ఈ అహంకార పాలన మనకొద్దు: ష‌ర్మిల

Drukpadam

Leave a Comment