- మహారాష్ట్రలో జెండా ఎగరవేసిన బీఆర్ యస్
తెలంగాణ ఆవల తొలిగెలుపుతో బీఆర్ యస్ శ్రేణుల్లో ఆనందం
ఒక గ్రామ పంచాయతీ వార్డ్ ఉపఎన్నికల్లో బీఆర్ యస్ అభ్యర్థి విజయం
మహారాష్ట్ర పై కేసీఆర్ ఫోకస్
ఇప్పటికే మూడు బహిరంగ సభలు …శిక్షణ - ఇటీవలే పార్టీలో చేరిన అభ్యర్థి
- అంబేలోహల్ పంచాయతీ వార్డు సభ్యుడిగా విజయం
మహారాష్ట్రలో బీఆర్ యస్ జెండా ఎగర వేసింది. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆవల జరిగిన ఎన్నికల్లో గెలవడంతో బీఆర్ యస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కేసీఆర్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర పై ఫోకస్ పెట్టారు . ఇప్పటికే మూడు బహిరంగసభలు పెట్టిన పార్టీలో చేరినవారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు .
తెలంగాణకు ఆవల బీఆర్ఎస్ తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.