Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి కామెంట్స్ పై మంత్రి పువ్వాడ ఆగ్రహం …!

పొంగులేటి కామెంట్స్ పై మంత్రి పువ్వాడ ఆగ్రహం …!
కేసీఆర్ ,కేటీఆర్ అండతోనే వేలకోట్లు సంపాదించావు
ఎన్ ఎస్ పీ ఆధునికీకరణ పేరుతో వేల కోట్లు దండుకున్నావు
దీనిపై నీ కజిన్ ఫిర్యాదు చేశాడు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే బచ్చా
నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలుతో సమానం
పేదలను పీడించిన దోపిడీదారులు ,బ్యాంకు దొంగలు, రౌడీ షీటర్లు నీ వంచన ఉన్నారు

 

ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడపై ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి చేసిన విమర్శలకు ప్రతిగా మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు . సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిన సందర్భంగా పొంగులేటి పై పదునైన విమర్శలు ..వాగ్బాణాలు సంధించారు .

తనపై ఒక బచ్చాగాడ్ని నిలబెట్టి గెలిపిస్తానని చేసిన సవాల్ పై భగ్గుమన్నారు . రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావు…. మా చరిత్ర ఏమిటి ? నీ చరిత్ర ఏమిటి …? 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానుపీడిత తాడిత ప్రజలకోసం కొట్లాడినవాళ్ళం ….నా తండ్రి ఎన్నో ఉద్యమాలు నడిపారు . మరి నీ చరిత్ర ఏమిటని నిగ్గదీశారు . 2016 లో టీఆర్ యస్ పార్టీలోకి రాక ముందు నీ అడిట్ రిపోర్ట్ బయట పెట్టుఇప్పుడు రిపోర్ట్ పెట్టు వేల కోట్లు ఎలా సంపాందించావుకేసీఆర్ ,కేటీఆర్ చలవతో కదా ..? ఫార్చనర్ కారు లో తిరిగిన నీవు నేడు ఫెరారీ , ఆడి కార్లలో తిరుగుతున్నావుఎక్కడ నుంచి వచ్చింది ఇదంతా ..ఎన్ ఎస్ పీ ఆధునికీకరణ పేరుతో కాల్వలకు సిమెంట్ ఫిచుకారి చేసి వేల కోట్లు సంపాందించింది నిజం కదా ..?దీనిపై నీ కజిన్ ఫిర్యాదు చేయలేదా అని నిలదీశారు . ఇది ఇంకా అయిపోలేదునిన్ను వదిలి పెట్టం బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారునీకింద పనిచేసిన సబ్కాంట్రాక్టర్లు నీ పని పట్టేందుకు ఎదురు చూస్తున్నారు . రేపు ఖమ్మం కూడా వస్తారునిన్ను తరిమి తరిమి కొట్టే రోజు ఎంతోదూరంలో లేదుఅని తనదైన శైలిలో పొంగులేటిపై పువ్వాడ తన ఉగ్రరూపం చూపించారు .

అడ్డగోలుగా అడ్డదార్లలో డబ్బు సంపాదించిన నువ్వు ఆడబ్బు ఉందికదా అని వీర్ర వీగుతున్నావుఖమ్మం ప్రజలకు నీ డబ్బు ఎడమ కాలుతో సమానంగుర్తుంచుకో బిడ్డానీకు నువ్వు అతిగా ఉహించుకుంటున్నావు
పిట్టల దొర మాదిరిగా వేషాలు వేస్తున్నావుఅమెరికా ప్రెసిడెంట్ , రష్యా ప్రెసిడెంట్ తెలుసనీ కట్టే తుపాకీ పట్టుకొని పిట్టలదొర కామెడీ లాగా మాట్లాడుతున్నావుఎంపీ గా ఖమ్మం జిల్లాకు చేసిన ఒక్క మంచిపని చెప్పగలవా అని ప్రశ్నించారు. ఉట్టికెక్కలేనమ్మ ,స్వర్గానికి ఎక్కినట్లు , కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయితీసిన చందంగా మాట్లాడటం మనుకోవాలాలని మంత్రి అజయ్ ,పొంగులేటికి హితవు పలికారు .

ఖమ్మం చుట్టూ ఉన్న గుట్టలు మట్టి కాజేస్తున్నానని అబద్దపు ఆరోపణలు చేస్తున్నావు గుట్టల మట్టి నేషనల్ హైవే కోసం తీసుకోని పోతున్నారు . అభివృద్ధిలో భాగంగానే అది జరుగుతుంది దానికి నాకు సంబంధం లేదుప్రభుత్వ నిర్ణయంలో భాగంగా చేస్తున్న పనులను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు . మట్టి క్లియర్ అయిన తర్వాత భూములను పేదలకు పంచుతామని పేర్కొన్నారు .

డిసెంబర్ నెలవరకు పోలిసుల ఎస్కార్ట్ తో ముందు వెనక వాహనాలతో తిరిగిన నువ్వు పోలీసులను విమర్శిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . మా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన మహానుభావుడు నువ్వు మళ్ళీ పోలీసులను విమర్శిస్తున్నావా?? 2018 ఎన్నికల్లో నీ మనుషులు అనుకున్నవారికి ఐదుగురికి టికెట్స్ ఇస్తే గెలిపించలేక పోయావు . పైగా వైరాలో పార్టీ అధికార అభ్యర్థి మదన్ లాల్ ను ఓడించి అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తిని గెలిపించావు. మధిరలో కూర్చొని లింగాల కమల్ రాజ్ ను గెలిపించలేక పోయావు . నీ అభ్యర్థులు తాటి వెంకటేశ్వర్లు , పాయం వెంకటేశ్వర్లు , తెల్లం వెంకట్రావు లు గెలవలేదు . అందుకే నీకు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు .అయినప్పటికీ నీలో మార్పు రాలేదుఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధుకు వ్యతిరేకంగా పనిచేశావు . కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులకు వ్యతిరేకంగా డబ్బులు ఇచ్చావుఇందుకు పాపారావు , మేయర్ , కమర్తపు మురళిలు సాక్షం …. నీ డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు ఇక్కడ లేరు .నలుగురికి డబ్బులు ఇచ్చి సభలు పెట్టి అదే గొప్పగా ఫీలవుతున్నావు..సభ పెట్టితే ఖాళీ కుర్చీలను చూసి ప్రస్టేషన్లో నన్ను తిడుతున్నాడు.. రాజకీయ పార్టీలకు పోవాలో తెలియని ప్రెస్టేషన్లో ఉన్న వ్యక్తివి అని పొంగులేటి పై ధ్వజమెత్తారు ..ఒక సిద్ధాంతం లేదు ఒక విలువ లేదు ఒక గుణం లేదు కేవలం డబ్బు రాజకీయంతో పనిచేయాలని చూస్తుతున్నావ్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు .. టిఆర్ఎస్ అభ్యర్థులను ఇదే పార్టీలో ఉండి ఓడించిన ఘనమైన చరిత్ర నీదని గుర్తు చేశారు .. 2018లో నువ్వు చేసిన పిచ్చి పనికె 2019లో నీకు సీటు రాకుండా చేసింది..2014లో కూరాకుల నాగభూషణం గొంతు కోసిన చరిత్ర మర్చిపోయావా?? పోయిన ఎన్నికల్లో కమల్ రాజు,మదన్ లాల్ గొంతులు కోసిన వ్యక్తివి నువ్వు.. బిడ్డ వచ్చే రోజులలో నీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళ చిట్టా చాలా పెద్దగా ఉంది వాళ్లంతా నీకు వచ్చే రోజుల్లో నీకు స్వాగతం చెప్పబోతున్నారుఇప్పుడేదో పొడుస్తా ,కరుస్తా అంటున్నావు . నీవ్వు కాంగ్రెస్ లో పోతున్నావుఅక్కడ కూడా ఇదే కొనసాగిస్తే నీపని అయిపోవడం ఖాయమని పొంగులేటి వైఖరిపై పువ్వాడ విమర్శలు గుప్పిస్తూనే సైటర్లు వేశారు .

డబ్బుందని విర్రవీగుతున్న నాయకుడా మా ఖమ్మం ప్రజలకు ని డబ్బు ఎడమ కాలు చెప్పుతో సమానం.. నీ డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు ఇక్కడ లేరు .నలుగురికి డబ్బులు ఇచ్చి సభలు పెట్టి అదే గొప్పగా ఫీలవుతున్నావు..సభ పెట్టితే కాళీ కుర్చీలను చూసి ప్రస్టేషన్లో నన్ను తిడుతున్నాడు.. రాజకీయ పార్టీలోకిపోవాలో తెలియని ప్రెస్టేషన్లో ఉన్న వ్యక్తి పొంగులేటి. కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు. పోతేపో కారుకూతలు మానుకో లేకపోతే ప్రజలు బద్దిచెప్పడం ఖాయమన్నారు.

కళ్యాణ లక్ష్మి ఒక గొప్ప పథకం. లక్షలాదిమంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ సహాయమందించారు కల్యాణ లక్ష్మిలో కొందరు దొంగలు పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు సరిచేసి ఎమ్మెల్యేలకు అధికారం ఇచ్చి అవినీతిని కట్టడి చేశారు. 51 వేల రూపాయలతో మొదలైన కళ్యాణ లక్ష్మి పథకాన్ని లక్షకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది . తెలంగాణలో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధి చేకూర్చారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి మానవీయ కోణంలో పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ . జిల్లా కేంద్రంగా ఉన్న ఖమ్మంలో గతంలో పట్టించుకున్న నాయకుడే లేరు. ఖమ్మం అభివృద్ధి మీద కొందరు కడుపులో విషం నింపుకున్నారు. కెసిఆర్ , కేటీఆర్ అండతో పువ్వాడ అభివృద్ధి చేయడాన్ని కొందరు జీవించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు . సమావేశంలో మేయర్ పూనుకొల్లు నీరజ , బచ్చు విజయ్ కుమార్ , కమర్తపు మురళి , కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related posts

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్ …కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!

Drukpadam

జగన్ తనను తాను నిర్బంధించుకున్నట్టే!: సోము వీర్రాజు!

Drukpadam

విజయవాడలో బాలిక ఆత్మహత్య… టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం!

Drukpadam

Leave a Comment