Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం!

ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం!

  • ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన
  • శిశువులు తక్కువ బరువుతో పుట్టడంతో ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స
  • తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు 

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ నగరంలోగల రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, శిశువులు తక్కువ బరువు ఉండటంతో వారిని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని నిశితంగా పరిశీలించేందుకు ఎన్‌ఐసీయూలో పెట్టామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో వెల్లడించారు. ‘‘ఛాటర్‌కు చెందిన ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులను ఎన్‌ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నాం’’ అని రిమ్స్ వైద్యులు తెలిపారు.

Related posts

ఏపీలో అక్రమాలపై గళమెత్తినందుకు నా కుటుంబాన్ని హింసిస్తున్నారు.. రాష్ట్రపతి, ప్రధాని, హైకోర్టు సీజేలకు ప్రవాసాంధ్రుడి లేఖ…

Drukpadam

రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు అసహనం…

Drukpadam

మంచు ఖండంలోనూ మహిళలకు లైంగిక వేధింపులు!

Drukpadam

Leave a Comment