Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనాతో కన్నుమూసిన యూపీ మంత్రి విజయ్ కశ్యప్…

కరోనాతో కన్నుమూసిన యూపీ మంత్రి విజయ్ కశ్యప్….
మహమ్మారి కాటుకు బలైన మూడో మంత్రి
మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
కరోనా బారినపడి మరణించిన ఐదో ఎమ్మెల్యే
ప్రధాని మోదీ, సీఎం యోగి సహా పలువురి సంతాపం

ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో మృతి చెందారు. 56 ఏళ్ల మంత్రి ముజఫర్‌నగర్‌లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. విజయ్ కశ్యప్‌తో కలిపి యూపీలో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనాతో మృతి చెందారు.

గతేడాది మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ కరోనాతో మృతి చెందారు. విజయ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి మరణించిన బీజేపీ ఎమ్మెల్యేలలో విజయ్ కశ్యప్ ఐదోవారు.

అంతకుముందు సలోన్ శాసనసభ్యుడు దాల్ బహదూర్ కోరి, నవాబ్‌‌గంజ్ శాసనసభ్యుడు కేసర్ సింగ్ గంగ్వార్, ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీవాస్తవ కరోనాకు బలయ్యారు. శ్రీవాస్తవ భార్య కూడా కరోనా కారణంగా మృతి చెందారు.

Related posts

మాస్క్ లు లేకుండా తిరుతుతున్న మహిళలు …మాస్క్ లు ఇచ్చిన మంత్రి …

Drukpadam

హిమాచల్ లో పర్యాటకులు గుంపులు… కేంద్రం ఆందోళన!

Drukpadam

విజయవాడలో ఆసక్తికర ఘటన.. అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చిన భార్య!

Drukpadam

Leave a Comment