Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బాలానగర్ లో ప్రైవేటు బస్సు దగ్ధం…

బాలానగర్ లో ప్రైవేటు బస్సు దగ్ధం…

  • సుచిత్ర నుండి కూకట్ పల్లి వెళ్తున్న బస్సులో మంటలు
  • పెట్రోల్ బంకు సమీపంలో దగ్ధమైన బస్సు
  • బస్సులోని డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు సురక్షితం

హైదరాబాద్ లోని బాలానగర్ లో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ బస్సు సుచిత్ర నుండి కూకట్ పల్లి వైపు వెళ్తోంది. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే ఇంజిన్ నుండి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి, కిందకు దిగాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

బస్సు నిలిపిన సమీపంలో పెట్రోల్ బంకు ఉండటంతో అందరూ ఆందోళన చెందారు. రోడ్డుపై బస్సు దగ్ధం కావడంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.

Related posts

కృష్ణా జిల్లాలోకలకలం … జగన్ కటౌట్ కు నిప్పు…

Drukpadam

230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి కంటెయినర్‌ను ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం!

Drukpadam

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట-రేవంత్ రెడ్డి పై చార్జిషీటు!

Drukpadam

Leave a Comment