Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

  • =బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఓ గూడ్స్ రైలు ఢీ
  • -కోరమాండల్ , గూడ్స్ ,యశవంతపుర్ సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొన్న ఘటన——–కోరమాండల్ లూప్ లైన్లోకి రావడమే ప్రమాదానికి కారణమంటున్న నిపుణులు
  • -ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని దిగ్బ్రాంతి …ప్రమాద స్థలి పరిశీలనకు ఢిల్లీ -నుంచి బయలుదేరిన ప్రధాని , ఇప్పటికే బాలాసోర్ చేరుకున్న ఒడిశా సీఎం -నవీన్ పట్నాయక్ , రైల్వే మంత్రి శ్రీవైష్ణవి .పలువురు అధికారులు
  • -ఏపీ ప్రయాణికుల విషయంలో సీఎం జగన్ సమీక్షా
  • -హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లాలని మంత్రి అమరనాథ్ ను ఆదేశం

రైలు ప్రమాదంలో మరణించిన శవాల గుట్టలు …గాయాల పాలైన వ్యక్తి

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మందికి పైగా చనిపోయారని , మరో 900 మంది క్షతగాత్రులను వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్పటల్ కు తరలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు . ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉండవచ్చినని తెలుస్తుంది. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన పెద్ద ప్రమాదంగా రైల్వే అధికారులు చెపుతున్నారు . ఈసంఘటనలో ఎవరి పాత్ర ఎంత …? ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు .

మొదట హౌరా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మెయిన్ లైన్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ , లూప్ లైన్లుకి ఎందుకు వెళ్ళింది .అనేది రైల్వే అధికారులకు సైతం అంతు చిక్కడంలేదు ..దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టారు . అయితే లూప్ లైన్లో వెళుతున్న కోరమాండల్ రైలు దానిముందు ఆగి ఉన్న గూడ్స్ రైలు ను బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జారింది . బోగీలు అన్ని ఒక్కసారిగా గాల్లో లేచినట్లు లేచి పక్కనే ఉన్న మెయిన్ ట్రాక్ పై పడ్డాయి. దీంతో యశవంతపుర్ నుంచి వస్తున్నా మరో సూపర్ ఫాస్ట్ రైలు కు ప్రమాదం ముంచుకొచ్చింది. మూడు రైళ్లు క్షణాల్లో ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ప్రయాణిస్తున్న ప్రయాణికులాలు ఏమి జరిగిందో అర్థం అయ్యే లోపే అనేక మంది ప్రాణాలు పోయాయి. వందలాది మందికి గాయాలైయ్యాయి. ఆర్తనాదాలు మిన్నంటాయి. శవాలు గుట్టలుగా మారాయి. గమ్యస్థానానికి క్షేమంగా చేరాల్సిన రైలు బాలాసోర్ సమీపంలో మృత్యు శకటంగా మారింది. ఈ సంఘటన దేశం మొత్తాన్ని నిద్ర లేకుండా చేసింది . ప్రధాని మోడీ విషయం తెలియగానే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు . ఒడిశా , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు సీఎంలు నవీన్ పట్నాయక్, వైయస్ జగన్ , స్టాలిన్ లు ఈ ఘోర సంఘటనపై తీవ్ర విచారం ప్రకటించారు . వందలాది మంది ప్రాణాలు కోల్పోడంపై ప్రతిపక్షాలు రైల్వే మంత్రి వైష్ణవ్ రాజినామా చేయాలనీ డిమాండ్ చేశాయి.

ప్రధాని రైల్వే అధికారులతో సంఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు . ఈసమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు . ఇప్పటికే రైల్వే మంత్రి సంఘట స్థలంలో ఉండగా ప్రధాని సైతం సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు . కటక్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు .ఇది ఘోర సంఘటన అని మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కరికి 2 లక్షలు , గాయపడిన వారికీ 50 వేల రూపాయలు ప్రకటించారు . తమిళనాడు సీఎం స్టాలిన్ మరణించిన వారి కుటుంబానికి ఒక్కరికి 5 లక్షలు , గాయపడిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ప్రకటించారు . కోల్ కత్తా నుంచి చెన్నై , బెంగుళూరు వరకు అన్ని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు . ఏపీ లోని రాజమండ్రి , తాడేపల్లిగూడెం , ఏలూరు , విజయవాడ ప్రయాణికులపై బంధువులు ఆరా తీస్తున్నారు. అయితే చాలామంది క్షేమంగానే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Odisha train accident 207 dead over 900 injured

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 207 మంది మృతి చెందగా మరో 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. బోగీల్లో అనేక మంది చిక్కుకుని ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

బాలేశ్వర్‌కు సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వద్ద రెండు ప్యాసెంజర్, ఒక గూడ్స్ రైలు రాత్రి 7 గంటల సమయంలో ఢీకొన్న విషయం తెలిసిందే. తొలుత బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పడంతో పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న షాలీమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఈ బోగీలను ఢీకొట్టింది. ఆ తరువాత మరో గూడ్స్ రైలు కూడా వీటిని ఢీకొట్టింది. ఇలా మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కాగా, ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికార ప్రతినిధి మరో వివరణ ఇచ్చారు. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో పలు బోగీలు ఒకదానిపై మరొకటి పడ్డాయి. కొన్ని నుజ్జునుజ్జయ్యాయి. బోగీల్లో మరో 600-700 మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న రాష్ట్ర, కేంద్ర సహాయక బృందాలు బాధితులను వివిధ ఆసుపత్రులకు తరలించాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఒడిశా రైలు ప్రమాదం: ‘కవచ్’ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది!

  • ఒడిశా రైలు ప్రమాదం జరిగిన మార్గంలో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదన్న అధికారులు
  • రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వస్తే ఢీకొనకుండా ఆపే వ్యవస్థ
  • 2022లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ
  • దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు.. 
 

 

ఆ ఒక్కటీ ఉండి ఉంటే.. రైలు క్షేమంగా గమ్యానికి చేరేది. ఆ ఒక్కటీ ఉండి ఉంటే.. ఘోర ప్రమాదం తప్పేది..
ఈ పాటికి అందరూ తమ వాళ్లతో.. తమ పనుల్లో ఉండే వాళ్లు.. అంతా యథాతథంగా కొనసాగేది. వందల ప్రాణాలు నిలిచేవి.. వేల మందికి కన్నీళ్లు తప్పేవి.. కానీ దురదృష్టం వెంటాడింది.. విధి మరోలా తలచింది..
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ప్రమాదం జరిగిన రైల్వే రూట్ లో ‘కవచ్’ సిస్టమ్ అందుబాటులో లేదని తాజాగా వెల్లడైంది. రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే ఈ సిస్టమ్ ఉండుంటే.. ప్రమాదం జరిగేది కాదని అధికారులు అంటున్నారు.
ఏదైనా లోపం వల్లో, మానవ తప్పిదం వల్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినప్పుడు.. అవి ఢీకొనకుండా ఆపేందుకు రైల్వే శాఖ 2022లో ‘కవచ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇదో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్. దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
రెండు రైళ్లు ఒకే ట్రాక్‌లో వస్తే.. అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. రైలు వేగాన్ని కంట్రోల్ చేస్తుంది. తక్కువ వెలుతురు ఉన్న సమయంలో రైళ్లు సురక్షితంగా నడిచేలా సాయపడుతుంది. నిర్ణీత సమయంలో డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమైతే.. ఆటోమేటిక్ గా బ్రేకులు వేస్తుంది. ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఈ వ్యవస్థను స్వయంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరీక్షించారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు వచ్చినప్పుడు.. 380 మీటర్ల దూరంలోనే ట్రైన్ ఆగిపోయినట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 రూట్ కిలోమీటర్లు కవర్ అయ్యాయి. మార్చి 2024 నాటికి దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కవచ్ టెక్నాలజీని అమల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

కానీ కవచ్ వ్యవస్థ ఇంకా ఒడిశా రూట్లలో అందుబాటులోకి రాలేదు. అందుకే ఈ ఘోర ప్రమాదాన్ని ఆపలేకపోయింది. ‘‘రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తున్నాం. ఈ మార్గంలో కవచ్ సిస్టమ్ అందుబాటులో లేదు’’ అని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. నిజం.. కవచ్ ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు: వాల్తేరు డీఆర్ఎం

DRM says 178 passengers travelling in Coromandel express

భారత రైల్వే చరిత్రలో ఘోరం అనదగ్గ దుర్ఘటన ఒడిశాలోని బాలాసోర్ లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లోనూ భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ ఘటనపై వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) స్పందించారు.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

బాలాసోర్ నుంచి ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైలు మరో రెండు గంటల్లో విశాఖ రానుందని వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళుతోందని వివరించారు. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఎందరు ఏపీ ప్రయాణికులు ఉన్నారో తేలాల్సి ఉందని అన్నారు.

కాగా, బహానాగ్ స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ ఐజీ వివరాలు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో మొత్తం 17 బోగీలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఘటన స్థలిలో ఇప్పుడు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని వివరించారు. విచారణ తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

Related posts

మరియమ్మ లాక్ అప్ డెత్ kesu లో ఎస్ ఐ ,ఇద్దరు కానిస్టేబుళ్ల ను ఉద్యోగాలు తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ….

Drukpadam

కాంగ్రెస్ సీనియర్లపై ట్రోలింగ్ ఎవరి పని? ఆ నేత ఫిర్యాదుతో బట్టబయలు..!

Drukpadam

లడఖ్ లో ఘోర ప్రమాదం… 9 మంది ఆర్మీ జవాన్ల దుర్మరణం

Ram Narayana

Leave a Comment