Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే: కేంద్రం స్పష్టీకరణ…

-వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ
-తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
–  వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు
-పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు
-వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.

కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. వాట్సాప్ తన కొత్త ప్రైవసీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ ఇండియా విభాగానికి నోటీసులు జారీ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ విధానం వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.కేంద్రం నిర్ణయంతో వాట్సప్ తన నిర్యాన్ని ప్రకటించి యూజర్ల ప్రైవసీ కాపాడుతుందా? లేక తన పాలసీ ప్రకారం లేళ్లుతుందా అనేది చూడాలి .ప్రస్తుతానికి తమ ప్రైవసీ వాయిదా వేసుతున్నట్లు ప్రకటించి తప్పించుకోవాలని చుసిన వాట్సప్ పై కేంద్రం గట్టిగానే హెచ్చరికలు జారీచేసింది.

Related posts

సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్ల పరుగు.. చైనా వ్యక్తి రికార్డు!

Drukpadam

బిగ్ బాస్ ఓ బ్రోతల్‌ స్వర్గం-నారాయణ కలకలం : ముద్దులు-డేటింగ్ : జగన్ మంచి నిర్ణయం..!!

Drukpadam

ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం

Drukpadam

Leave a Comment