Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహిళా రెజ్లర్ల పోరాటాకి ఎస్ ఎఫ్ ఐ ఖమ్మం పూర్వవిద్యర్ధుల మద్దతు …

మోడీ పాలనలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం

  • ఎస్ఎఫ్ఐ పూర్వవిద్యార్థుల కమిటీ కన్వీనర్‌ ఎం. సుబ్బారావు
  • మహిళా మల్లయోధుల పోరాటానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం పటేల్ స్టేడియంలో ప్రదర్శన
  • బీజేపి దుర్మార్గపు పాలనలో లౌకిక తత్వం నాశనం అవుతుందని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్‌ ఎం.సుబ్బారావు ఆరోపించారు. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించిందన్నారు. నేడు ఇవన్నీ ప్రమాదంలో పడడంతో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులుగా వేధింపులకు గురైన మహిళా మల్లయోధుల పోరాటానికి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చామన్నారు. ఢిల్లీలో రేజ్లర్ల పోరాటానికి సంఘీభావంగా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడారు. మహిళా మల్లయోధులను వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య జాతీయ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను పదవి నుంచి తొలగించడంతోపాటు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పేరు తెచ్చిన రేజ్లర్లు రోడ్డెక్కి ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నా మోడీ సర్కార్ కు పట్టడం లేదన్నారు. మల్ల యోధులను వేధింపులకు గురి చేసిన నీచుడు బ్రిజ్ భూషణ్ పార్లమెంటు ప్రారంభానికి కూడా వెళ్లడం జుగుప్సాకరం అన్నారు. గూండాలు, సన్యాసులు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ప్రదర్శనను ప్రారంభిస్తూ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమైన ప్రజా సమస్యలపై మౌనం దాల్చిన బిజెపి ప్రభుత్వ విధానాలతో దేశంలో అశాంతి నెలకొందన్నారు. 7, 8 మంది పై లైంగిక దాడి జరిగిందని మహిళా మల్లయోధులు ఆరోపిస్తూ.. ఆందోళనలు నిర్వహిస్తుంటే బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదన్నారు. బేటి బచావో.. బేటి పడావో అని నినాదాలు ఇస్తున్న మోడీ అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తూ పతకాలు సాధించిన మహిళా రేజ్లర్ల గోడు పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మహిళలనే ఇలా వేధిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? అని ఆవేదన వెలిబుచ్చారు. ఫోక్సో చట్టం కింద సంబంధిత ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల కమిటీ కో కన్వీనర్లు రాజు, ఉన్నం లక్ష్మీనారాయణ, ప్రత్యామ్నాయ పౌర సమూహం నాయకులు డాక్టర్ గోపీనాథ్, రవిమారుత్, ఐవీ రమణారావు, భారీ సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

పీజీ నీట్ ను వాయిదా వేయలేం.. కొందరి కోసం ఎక్కువ మందికి నష్టం చేయలేం: సుప్రీంకోర్టు!

Drukpadam

హుజూరాబాద్‌ పోలింగ్‌లో ఉద్రిక్త‌త‌.. స్వల్ప ఘర్షణలు…

Drukpadam

Global Funds Expanding Into Massive Chinese Investment Market

Drukpadam

Leave a Comment