Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..

అమెరికాలో తెలుగు ఎన్నారై దుర్మరణం..కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో దుర్ఘటన…

  • కాలిఫోర్నియా పాంథర్ బీచ్‌లో గత సోమవారం వెలుగుచూసిన ఘటన
  • సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేకపోయిన శ్రీనివాసమూర్తి కుమారుడు
  • తనకు ఈతరాకపోయినా కుమారుడి కోసం నీళ్లల్లోకి దిగిన శ్రీనివాసమూర్తి
  • కొడుకును రక్షించాక అనుకోని ప్రమాదం
  • పెద్ద అల రావడంతో సముద్రంలో మునిగిపోయిన ఎన్నారై
  • అత్యవసర సిబ్బంది ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ ఎన్నారై మృతి

అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు ఎన్నారై ఇటీవల దుర్మరణం చెందారు. నీట మునుగుతున్న తన 12 ఏళ్ల కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని పాంథర్ స్టేట్‌ బీచ్‌లో ఈ దుర్ఘటన జరిగింది. గత సోమవారం సాయంత్రం శ్రీనివాసమూర్తి కుమారుడు సముద్రంలోకి వెళ్లి బయటకు రాలేకపోయాడు.

ఇది గమనించిన శ్రీనివాసమూర్తి తనకు ఈత రాకపోయినా నీళ్లల్లోకి దిగి కొడుకును కాపాడారు. ఇంతలో ఓ భారీ అల ఆయనను సముద్రంలోకి లాక్కెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. అత్యవసర సిబ్బంది ఆయనను బయటకు తీసుకొచ్చి స్థానిక ఆసుపత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసమూర్తి మరణించారు.

Related posts

కబడ్డీలో కూతకు వెళ్లి మరణించిన కబడ్డీ ప్లేయర్!

Drukpadam

ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూనే కుప్పకూలిన వైఎస్ షర్మిల…!

Drukpadam

మా చానల్ ఇంకా నడుస్తుండడం ఆశ్చర్యకరమే: ఆఫ్ఘన్ టోలో న్యూస్ అధినేత!

Drukpadam

Leave a Comment