- 2017-22 మధ్య కాలంలో యూపీలో 41 మందిని చంపేశారన్న సిబాల్
- లక్నో కోర్టు ప్రాంగణంలో జీవాను కాల్చి చంపారని వ్యాఖ్య
- తీహార్ జైల్లో టిల్లును హత్య చేశారన్న సిబాల్
పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చంపబడిన ఘటనలను ఎన్నో చూస్తుంటాం. ఈ ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ సూటి ప్రశ్న వేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తులను చంపడంపై మీరు ఆందోళన చెందడం లేదా? అని ప్రశ్నించారు. తాము మాత్రం ఎంతో ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు.
2017-2022 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ లో పోలీస్ కస్టడీలో ఉన్న 41 మందిని చంపేశారని సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా లక్నో కోర్టు ప్రాంగణంలో పోలీస్ కస్టడీలో ఉన్న జీవాను కాల్చి చంపారని తెలిపారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఆతిక్, అష్రఫ్ లను కాల్చి చంపారని చెప్పారు. తీహార్ జైల్లో ఉన్న టిల్లును కాల్చి చంపారని గుర్తు చేశారు. ఈ ఘటనలు మీకు ఆందోళన కలిగించడం లేదా? అని ప్రశ్నించారు.