ఐటీలో తెలంగాణ మేటిగా ఎదిగింది: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
-ఐటీ రంగంగం అంటే తెలంగాణ వైపు చూస్తున్నారు
-ఈఘనత కేసీఆర్ ,కేటీఆర్ లదే…
-పెట్టుబడిదారులకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది:ఎంపీ రవిచంద్ర
-క్రీడలలో మన వాళ్లు బాగా రాణిస్తున్నారు
-విద్యార్థులు,యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి:ఎంపీ రవిచంద్ర
-ఎంపీ వద్దిరాజు యువ ఉత్సవ్ లో ఉత్తేజిత ప్రసంగం…
తెలంగాణ రాష్ట్రం ఐటీలో మేటిగా ఎదిగిందని,ఈ రంగంలో 10లక్షల మంది పని చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు . స్వర్ణభారతి కాలేజీలో జరిగిన యువ ఉత్సవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఐటీ ఉత్పత్తులు 57,000కోట్లు కాగా,సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో , మంత్రి కేటీఆర్ పట్టుదల,కృషి కారణంగా 2,42,000కోట్లకు చేరుకున్నాయన్నారు . ఈ రంగం ఒక హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా ఐటీని విస్తరించడం శుభపరిణామమన్నారు .దేశమే కాదు మొత్తం ప్రపంచం ఐటీ రంగాన్ని గురుంచి చెప్పుకోవాల్సి వస్తే హైద్రాబాద్ ను గురుంచి చెప్పకుండా ఉండలేని పరిస్థితి ఉందని అన్నారు .రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చు దిద్దిన కేసీఆర్ ను మరోసారి ఆశ్వీర్వదించాలని కోరారు .
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో గురువారం యువ ఉత్సవ్ జరిగింది.ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఈ కాలేజీలో ఇటీవల జాబ్ మేళా నిర్వహించగా అనూహ్య స్పందన లభించిందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల ఆలోచనలు,పాలనాదక్షతతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని, పెట్టుబడిదారులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రవిచంద్ర వివరించారు.ఐటీ,ఫార్మా, ఎలక్ట్రానిక్స్,ఎయిరోస్పేస్ తదితర రంగాలలో దూసుకుపోతున్నామని చెప్పారు.దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా 1006 గురుకుల పాఠశాలలు,ప్రతి జిల్లా కేంద్రంలో వైద్య, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.నిన్ననే మన ఖమ్మం ముద్దుబిడ్డ మేఘన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బంగారు పతకం సాధించిందని, నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ గొప్పగా రాణిస్తున్నదని పేర్కొన్నారు.మన తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తుండడంతో అద్భుతమైన విజయాలు మన సొంతమవుతున్నాయని వివరించారు.ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా యువతదేనని,అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదగాలని ఎంపీ రవిచంద్ర అభిలషించారు.ఈ సందర్భంగా కాలేజీ యజమాని ఆర్జేసీ కృష్ణ, ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ లు ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.ఈ యువ ఉత్సవ్ లో వందలాది మంది విద్యార్థులు, నెహ్రూ యువ కేంద్రం అధికారి చింతల అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.