Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులకు అవకాశం …

ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో మార్పులు చేర్పులకు అవకాశం …
-ప్రాబబుల్స్ జాబితా సిద్ధం …
-కొత్తగూడెం నుంచి వద్దిరాజు /వనమా /కూనంనేని
-ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ
-పాలేరు నుంచి కందాల/తుమ్మల /తమ్మినేని
-మధిర నుంచి లింగాల కమల్ రాజ్
-వైరా నుంచి మదన్ లాల్ /చంద్రావతి / రాములు నాయక్
-సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య
-అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరావు
-ఇల్లందు హరిప్రియ నాయక్ /లేదా మరో కొత్త మహిళా నేత
-పినపాక నుంచి రేగా కాంతారావు /లేదా మరో అభ్యర్థి
-భద్రాచలం నుంచి ఈదే బుచ్చయ్య / రామకృష్ణ /డాక్టర్ మీడియం బాబురావు

ఎన్నికలు నెత్తిమీదకు వస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని దాదాపు ప్రారంభించాయి. మరి కొద్దీ నెలల్లో ఎన్నికలు దీంతో అధికార బీఆర్ యస్ పార్టీ మరిన్ని కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరు , లేని చోట్ల కొత్తవారికోసం అన్వేషణ ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టిన కేసీఆర్ నియోజకవర్గాల వారీగా సర్వే లు చేయించారు . ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నారు . రాష్ట్రంలోనే గత రెండు పర్యాయాలు ఒక్క సీటుతో మాత్రమే సరిపెట్టుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేంద్రీకరించారు . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా నేతలను అలర్ట్ చేశారు . నేతల మధ్య తగాదాలను పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలనీ అల్టిమేటం ఇచ్చారు. గీత దాటిన వారిపై వేటు తప్పదని హెచ్చరికల సైతం చేశారు . జిల్లాలకు నియోజకవర్గాలకు ప్రత్యేక ఇంచార్జిలను నియమించారు . మరికొంతమందిని నియమించాల్సి ఉంది. దీనికోసం కసరత్తులు ప్రారంభించారు . ప్రభుత్వ పనితీరుతోపాటు , ఎమ్మెల్యేల పనితీరు , ప్రజల్లో వారి పట్ల ఉన్న అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకోని గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం .

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తిరిగి మూడవసారి అధికారంలోకి రావడంద్వారా హ్యాట్రిక్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న గులాబీ దళం ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలని చెపుతూనే , ప్రజాకర్షక పథకాలు పెడుతుంది. అయితే అదే స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉందనే అంచనాలతో ,దాన్ని అధిగమించడానికి సరికొత్త అస్త్రాలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు , 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు . మిగతా 9 సీట్లలో ప్రతిపక్షాలు విజయ ఢంకా మోగించాయి. ( 2015 లో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరావు గెలిచారు ) దీంతో ఖమ్మం జిల్లా పార్టీలో 2014 నాయకులూ ఎవరు లేకున్నా ఒక్క జలగం వెంకట్రావు గెలవగా , 2018 లో రెండవసారి హేమ హెమీలుగా పేరున్న మంత్రి తుమ్మల, అప్పటిలో ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ , జలగం వెంకట్రావు , మదన్ లాల్ , పాయం వెంకటేశ్వర్లు , కోరం కనకయ్య , లాంటి వారు టీఆర్ యస్ గెలుపు కోసం కృషి చేశారు . అయినప్పటికీ గులాబీ అభ్యర్థులు ఓడిపోవడం సీఎం కేసీఆర్ సైతం కంగుతినిపించింది … . ప్రతిపక్షాల కూటమిలో ఉన్నవారు విజయం సాధించారు . దీంతో సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లాపై కోపం వచ్చింది. ఓటమి పై ఆయన వ్యాఖ్యానిస్తూ తమ కత్తులు తమనే పొడిచాయని అన్నారు . దీంతో పొంగులేటిని పక్కన పెట్టి, పక్క పార్టీలో ఉన్న నామ నాగేశ్వరావు ను తీసుకోని వచ్చి ఎంపీ గా నిలబెట్టారు . ఇప్పుడు టీఆర్ యస్, బీఆర్ యస్ గా మారింది. బీఆర్ యస్ పేరుతో జరుగుతున్న ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ సీట్లను పొందాలని వ్యూహాలు రచిస్తున్నారు .అందులో భాగంగానే ప్రాపబుల్స్ జాబితా సిద్ధం చేశారని ప్రచారం జరుగుతుంది. దాదాపు చిన్న చిన్న మార్పులు ఉంటె తప్ప వీరి నుంచే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సమాచారం …

ఖమ్మం ….

మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ సీటు దాదాపు ఖాయమనే చెప్పాలి .గత రెండు పర్యాయాలు ఆయన ఖమ్మం నుంచి ఎన్నికైయ్యారు . హ్యాట్రిక్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా కేసీఆర్ మార్చదలుచుకుంటే తప్ప అజయ్ బీఆర్ యస్ ఖమ్మం అభ్యర్థి … అయితే సిపిఎం , సిపిఐ పై పొత్తులపై ఆధారపడి కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది…

పాలేరు …

 

 

ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పై కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి గెలిచిన కొద్దీ కాలానికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ యస్ కు జై కొట్టారు . నియోజకవర్గంలో నిత్యం తిరుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . తిరిగి తనకే సీటు అన్న ఆశతో ఉన్న కందాల నిత్యం ప్రజల్లో ఉంటూ ఏ ఆపద వచ్చిన ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు . అయితే మాజీ మంత్రి తుమ్మల కూడా పాలేరును వదిలుకునేందుకు సిద్ధంగా లేరు …తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు . తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ తానే పోటీ చేయబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నారు . శ్రీసిటీ లో క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు . ఇక సిపిఎం తో పొత్తు కుదిరితే ఇక్కడ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తమ్మినేనికి సీటీ ఇస్తే కందాల , తుమ్మల ఆశలు వాదులు కోవాల్సిందే …

కొత్తగూడెం …

 

కొత్తగూడెం జనరల్ స్తానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన వనమా వెంకటేశ్వరావు అధికార బీఆర్ యస్ లో చేరారు .తిరిగి టికెట్ ఆశిస్తున్నారు . నీకే టికెట్ అని అనేక మంది బీఆర్ యస్ నేతలు వనమా కు ఫోన్ చేసి చెపుతున్నారని సమాచారం …అయితే సీఎం ఆలోచనలు వేరుగా ఉన్నాయని బీఆర్ యస్ వర్గాలే అంటున్నాయి. ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు , రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు , సిపిఐ తో పొత్తు ఉంటె ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు లైన్లు ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు పేరు కొత్తగూడెంకు పరిశీలనలో ఉందని సమాచారం…

మధిర ….

మధిర నుంచి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పేరు పక్కాగా వినిపిస్తుంది. ఏదైనా మార్పులు జరిగితే తప్ప ఆయనే అక్కడ బీఆర్ యస్ అభ్యర్థి అయితే ఇప్పటికే మూడు సార్లు ఆయన పోటీచేసి ఓడిపోయారనే సానుభూతి తో పటు మైనస్ కూడా ఉంది.

వైరా ….

 

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన లావుడ్య రాములు నాయక్ అధికార గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . అయితే ఈసారి ఆయనకు టికెట్ పై అనుమానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కారు గుర్తు పై పోటీచేసి ఓడిపోయిన బానోత్ మదన్ లాల్ ,డాక్టర్ చంద్రావతి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే మదన్ లాల్ కె మొగ్గు చూపుతున్నారని అంటున్నారు .

సత్తుపల్లి ….

 

సత్తుపల్లి నుంచి బీఆర్ యస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ వెంకట వీరయ్య కు ప్రత్యాన్మాయం లేదు ..

ఇల్లందు ….

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి బీఆర్ యస్ లో చేరిన హరిప్రియపై కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు . అందువల్ల మరో అభ్యర్థిని ఆలోచన చేస్తున్నార్నయి అంటున్నారు . మరో మహిళా అభ్యర్థిని కూడా రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

పినపాక ….

 

కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పినపాక నుంచి పోటీచేసి గెలిచిన రేగా కాంతారావు బీజేపీ వలలో చిక్కుకున్నారని అభియోగాలు వచ్చాయి. అయితే అది అధినేత కేసీఆర్ కు తెలిపి ఆయన సూచనల మేరకే నడుచుకున్నామని ఆయన పలుమార్లు అన్నారు . తాను కేసీఆర్ ఎక్కడ పోటీచేయమన్న చేస్తానని అంటూ వస్తున్నారు .దీంతో ఆయన అసెంబ్లీకి పోటీచేస్తారా లేక పార్లమెంట్ కా లేదా భద్రాచలం అసెంబ్లీకా అనేది చర్చ జరుగుతుంది. ఇక్కడ నుంచి కొత్త అభ్యర్థి అన్వేషణలో పార్టీ ఉందని వినికిడి …

అశ్వారావుపేట ….

అశ్వారావుపేట నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన మెచ్చా నాగేశ్వరావు తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ యస్ లో చేరారు .అయితే ఆయన తిరిగి పోటీచేసి చేస్తారా …? లేక కొత్త అభ్యర్థిని పెడతారా అనే ఆసక్తి నెలకొన్నది …

భద్రాచలం ….

గత ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీచేసిన డాక్టర్ తెల్లం వెంకట్రావు ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పొదెం వీరయ్య గెలిచారు . ఈసారి భద్రాచలం నుంచి అధికార బీఆర్ యస్ అభ్యర్థిలుగా ఈదే బుచ్చయ్య / రామకృష్ణ /డాక్టర్ మీడియం బాబురావు లు పరిశీలనలో ఉన్నారు . సిపిఎం కు ఇస్తే మీడియం బాబురావు పోటీచేస్తారు .

Related posts

ఖమ్మం లో మంకీ ఫాక్స్ కలకలం…?

Drukpadam

ఐఫోన్ కోసం సగటు భారతీయుడు ఎంతకాలం కష్టపడాలంటే…

Drukpadam

ముంబై లో లేడీ కానిస్టేబుల్ ఔదార్యం – ఉన్నతాధికారుల సెల్యూట్…

Drukpadam

Leave a Comment