ఆంధ్రప్రదేశ్

కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..!

కోడి ముందా? గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందోచ్..!

  • జీవపరిణామక్రమంపై బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం
  • మొదట్లో ఉభయచరాలు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చిన అధ్యయనకారులు
  • పరిస్థితులు అనుకూలించే వరకూ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని వెల్లడి
  • ప్రస్తుతం కొన్ని జాతుల బల్లులు అప్పుడప్పుడూ నేరుగా పిల్లల్ని కంటాయని వెల్లడి

కోడి ముందా..గుడ్డు ముందా..? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం చెప్పారు. కోడే ముందని ఆధారాలతో సహా నిరూపించారు. జీవ పరిణామక్రమంపై ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ అంశానికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సరీసృపాలు, పక్షులు, జంతువులు మొదలైనవి ప్రస్తుతం మనం చూస్తున్న రూపం సంతరించుకోక మునుపు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చారు. 51 శిలాజాలు, ప్రస్తుతం జీవించి ఉన్న 29 జంతుజాతుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇవి మొదట్లో తమ పునరుత్పత్తికి నీటిపైనే ఆధారపడేవని చెప్పారు. ఈ క్రమంలోనే పరిస్థితులు అనువుగా మారే వరకూ అవి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని చెప్పారు. ఆ తరువాత, నేలపై జీవనానికి అలవాటు పడే క్రమంలో గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు.

ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతుల బల్లులు అప్పుడప్పుడూ నేరుగా పిల్లలకు జన్మనిచ్చి తతిమా సందర్భాల్లో గుడ్లు పెడతాయని చెప్పారు. బ్రిస్టల్ యూనివర్సిటీ, నాన్జింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘ది జర్నల్ నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్‌’లో ప్రచురితమయ్యాయి.

Related posts

వైసీపీ హయాంలో 20 కోట్ల కల్తీ లడ్డూలు.. సిట్ దర్యాప్తులో వెలుగులోకి!

Ram Narayana

This couple Quit Their Jobs To Travel The World In A Customized Bus

Drukpadam

.పెళ్లి పీటల మీదకు తాగివచ్చిన వరుడు … పెళ్లి రద్దు …

Drukpadam