Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రఘురాజుకి జనరల్ ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్.. ఆర్మీ ఆసుపత్రి నివేదిక వెల్లడి!

రఘురాజుకి జనరల్ ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్.. ఆర్మీ ఆసుపత్రి నివేదిక వెల్లడి!
సీల్డ్ కవర్ ను తెరిచిన జస్టిస్ వినీత్ శరన్
రఘురాజుకు ఫ్రాక్చర్ అయినట్టు రిపోర్టులో ఉందన్న న్యాయమూర్తి
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షల రిపోర్టును, వీడియో రికార్డింగును సుప్రీంకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో అందజేసింది. ఈ సీల్డ్ కవర్ ను జస్టిస్ వినీత్ శరన్ ఈ రోజు తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించిన నివేదిక, ఎక్స్ రే, వీడియో కూడా పంపించారని ఈ సందర్భంగా జస్టిస్ శరన్ తెలిపారు. రఘురాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్టు కూడా రిపోర్టులో ఉందని చెప్పారు.

విచారణ సందర్భంగా రఘురాజు తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ… ఒక సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో రఘురాజును చిత్ర హింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ… ఆ గాయాలను రఘురాజు స్వయంగా చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ… సీఐడీ కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురాజు గాయాలు చేసుకున్నారని మీరు అంటున్నారా? అని ప్రశ్నించింది.

రఘురాజు కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ స్పందన
ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపిన ఓం బిర్లా
పూర్తి వివరాలను పంపించాలని హోంశాఖకు ఆదేశం
మరోవైపు రఘురాజు పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. ఓ వైపు బెయిల్ పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో రఘురాజు కుటుంబసభ్యులు తనకు ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఈ ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపించారు. అంతేకాదు, పూర్తి వివరాలను పంపించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు.
మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దవే వాదిస్తూ… రఘురాజుకు సంబంధించి ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికతో తాము విభేదించడం లేదని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అయితే రఘురాజుకు గాయాలు ఎలా అయ్యాయనే విషయం ఆసుపత్రి రిపోర్టులో లేదని చెప్పారు. నివేదిక అసంపూర్తిగా ఉందని తెలిపారు. కేసులో కక్షిదారుడు కాని జగన్ పేరును లాగొద్దని అన్నారు.

 

Related posts

రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారిని అపహరించి యువకుడి అత్యాచారం..!

Ram Narayana

సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!

Drukpadam

సి ఐ కి ఇదే పోయేకాలం …వివాహితను తుపాకీతో బెదిరించి రేప్!

Drukpadam

Leave a Comment